Monday, April 29, 2024

నగరంలో జోరుగా క్రికెట్ బెట్టింగ్

- Advertisement -
- Advertisement -

Cricket betting racket busted in Hyderabad

హైదరాబాద్: నగరంలో జోరుగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. కోట్లాది రూపాయలు బెట్టింగ్ నిర్వాహకులు బెట్టింగ్ కడుతున్నారు. దుబాయ్‌లో జరుగుతున్న ఐపిఎల్ క్రికెట్‌ను టార్గెట్ చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. గతంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారే ఈసారి కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్‌పై ఆసక్తి ఉన్న వారిని లక్షంగా చేసుకుని నిర్వహిస్తున్నారు. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. టివిలో క్రికెట్ చూస్తూ బాల్, బాల్‌కు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ నిర్వహించే వారు ఫోన్లు చేసి పంటర్ల సాయంతో డబ్బులు తీసుకుంటున్నారు. కోట్లాది రూపాయలు బెట్టింగ్ వ్యాపారం జరుగుతోంది.

బెట్టింగ్ రాయుళ్లుపై కన్నేసిన నగర పోలీసులు వారిపై ఉక్కుపాదం మొపుతున్నారు. ఎక్కడికక్కడ సమాచారం తెలుసుకుని అదుపులోకి తీసుకుంటున్నారు. చాలామంది నిర్వాహకులు సులభంగా డబ్బులు సంపాదించడం కోసమే బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహించే వారు పనికానిచ్చేస్తున్నారు. లావాదేవీలు మొత్తం కూడా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ద్వారా నిర్వహిస్తున్నారు. బెట్టింగ్‌లో డబ్బులు పోగోట్టుకున్న వారి నుంచి ఆన్‌లైన్ ద్వారానే బెట్టింగ్ డబ్బులు తీసుకోవడమే కాకుండా చెల్లింపులు కూడా అలాగే చేస్తున్నారు. ఇప్పటి వరకు 30మందిని అరెస్టు చేశారు. పట్టుబడుతున్న వారిలో ఎక్కువగా ప్రధాన బెట్టింగ్ నిర్వాహకుడు రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుండగా సబ్ ఆర్గనైజర్లుగా ఇక్కడి వారు వ్యవహరిస్తున్నారు. అతడికి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపిస్తున్నారు.

యాప్‌ల కేంద్రంగా…

బెట్టింగ్ నిర్వహించే వారు యాప్ సాయంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. క్రికెట్‌లైన్‌గురు, కింగ్‌ఎక్చేంజ్, డెల్టాఎక్చేంజ్.ఇన్ తదితర యాప్‌ల సాయంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వీటిలో ప్రతి బాల్‌కు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ కట్లే వారి పేర్లను రిజిస్ట్రర్‌లో నమోదు చేసి యూజర్ ఐడి, పాస్‌వర్డ్ ఇవ్వడంతో ఆన్‌లైన్‌లో చూసి బెట్టింగ్ కట్టాల్సి ఉంటుంది. వారి వివరాలను నమోదు చేసుకుంటారు. గెలిచిన వారికి డబ్బులు ఇవ్వడం ఓడిపోయిన వారి నుంచి కలెక్షన్ ఏజెంట్ డబ్బులు వసూలు చేస్తున్నాడు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వీరిపై పోలీసులు నిఘా పెట్టడంతో రోజు పట్టుబడుతున్నారు. బెట్టింగ్ వల్ల చాలామంది జీవితాలు తారుమారవుతున్నాయి. డబ్బులు వస్తాయన్న ఆశతో చాలామంది అమాయకులు అప్పులు తీసుకువచ్చి డబ్బులు పెడుతున్నారు. బెట్టింగ్‌లో డబ్బులు పోవడంతో అప్పులు తీర్చే దారి కన్పించక మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిని అడ్డుకునేందుకు పోలీసులు బెట్టింగ్ రాయుళ్లపై ఉక్కుపాదం మొపుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News