Friday, April 26, 2024

ప్రత్యేక కోర్టు తీర్పుపై మాధవ్ గాడ్బోలే దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

Madhav Godbole says It is an acid test of the constitution

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బిజెపి అగ్ర నాయకులు ఎల్‌కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి తదితర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఒకప్పటి పివి నరసింహారావు ప్రభుత్వంలో హోం కార్యదర్శిగా పనిచేసిన మాధవ్ గాడ్బోలే వ్యాఖ్యానించారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కరసేవకులు ధ్వంసం చేసినపుడు కేంద్రంలో పివి నరసింహారావు ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.
బాబ్రీ మసీదు కూల్చివేత ముందస్తు పథకం కాదన్న ప్రత్యేక కోర్టు తీర్పుతో ఆయన విభేదించారు. అది ముందుగా అనుకుని చేసిన పని కాకుంటే ఐదు గంటల్లో అంత భారీ మసీదును ఎలా కూల్చివేయగలిగారని గాడ్బోలే ప్రశ్నించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా, ముందుగా ఎటువంటి ఏర్పాట్లు లేకుండా అంత భారీ మసీదును ఐదు గంటల్లో నేలమట్టం చేయగలరంటే నమ్మశక్యం కాని విషయమని ఆయన అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో కుట్ర కోణంపై ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పులోని మొదటి భాగంపైనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన తెలిపారు.

Madhav Godbole says It is an acid test of the constitution

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News