Monday, April 29, 2024

యుద్ధ విమాన శబ్దానికి ఉలిక్కిపడిన ప్యారిస్..

- Advertisement -
- Advertisement -

ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగర గగనతలంపై నుంచి భారీ శబ్దంతో వెళ్లిన ఒక యుద్ధ విమానం నగర ప్రజలను వణికించింది. సూపర్‌సోనిక్ యుద్ధ విమానం సృష్టించిన భీకర శబ్దానికి ఇళ్లలోని కిటికీల అద్దాలు పగిలిపోగా పక్షులు భీతిల్లిపోయి చెల్లాచెదురుగా ఎగిరిపోయాయి. నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పోలీసులకు ఫోన్ చేసి ఏంజరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. ప్యారిస్ నగరంపై నుంచి యుద్ధ విమానం ఎందుకు పయనించిందో ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే అది యుద్ధ విమానమేనని రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఒకరు నిర్ధారించినప్పటికీ తదుపరి వివరాలు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. దీనిపై అత్యవసర సర్వీసులకు ఫోన్ చేయవద్దని ప్యారిస్ పోలీసులు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత శుక్రవారం వ్యంగ్య పత్రిక చార్లీ హెబ్డో ఒకప్పటి కార్యాలయాల వెలుపల కత్తి దాడి జరిగినప్పటి నుంచి ప్యారిస్ పౌరులు భయాందోళన చెందుతున్నారు.

Paris Rattled by Sonic Boom Military Jet Noise

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News