Thursday, May 16, 2024

బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే దోషి

- Advertisement -
- Advertisement -

Former Union Minister Dilip Ray convicted in coal scam case

ప్రత్యేక కోర్టు తీర్పు

న్యూఢిల్లీ: బొగ్గు గని కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రేను దోషిగా ప్రత్యేక తేల్చింది. 1999లో అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో జార్ఖండ్ బొగ్గు బ్లాక్ కేటాయింపులలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు దిలీప్ రేను దోషిగా నిర్ధారించింది. అప్పటి ప్రభుత్వంలో బొగ్గు శాఖలో పనిచేసిన ఇద్దరు సీనియర్ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతమ్‌లతోపాటు క్యాస్ట్రన్ టెక్నాలజీస్ లిమిటెడ్(సిటిఎల్), ఆ సంస్థ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్, క్యాస్ట్రన్ మైనింగ్ లిమిటెడ్‌లను కూడా దోషులుగా కోర్టు తేల్చింది. దోషులకు విధించాల్సిన శిక్షను అక్టోబర్ 14న ఖరారు చేస్తామని ప్రత్యేక కోర్టు జడ్జి భరత్ పరాషర్ మంగళవారం తెలిపారు. జార్ఖండ్‌లోని గిరిడీలో గల బ్రహ్మదిహ బొగ్గు నిక్షేపాలను1999లో సిటిఎల్‌కు కేటాయించడంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసుపై విచారణ జరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News