Wednesday, May 15, 2024

ధోనీ అలా అనడం తప్పే: కృష్ణమాచారి శ్రీకాంత్

- Advertisement -
- Advertisement -

చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై భారత మాజీ కెప్టెన్ కృష్ణమా చారి శ్రీకాంత్ ఫైర్ అయ్యాడు. ఈ సీజన్‌లో చెన్నై పేలవమైన ప్రదర్శనకు యువ క్రికెటర్ల వైఫల్యమే కారణమని ధోనీ చేసిన వ్యాఖ్యలను శ్రీకాంత్ తప్పుపట్టాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమితో చెన్నై నాకౌట్ అవకాశాలకు దాదాపు తెరపడినట్టే చెప్పాలి. ఇక మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ధోనీ యువ క్రికెటర్లపై విరుచుకు పడ్డాడు. యువ ఆటగాళ్లలో మెరుగ్గా రాణించాలనే కసి ఏమాత్రం కనిపించడం లేదన్నాడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారని ఆరోపించాడు.

అందుకే తాను యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వలేదని వివరించాడు. ఇదిలావుండగా ధోనీ చేసిన ఈ కామెంట్స్‌పై శ్రీకాంత్ తీవ్రంగా స్పందించాడు. ధోనీలాంటి ఆటగాడు యువ క్రికెటర్లకు సంబంధించి ఇలా వ్యాఖ్యలు చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. కేదార్ జాదవ్‌కు ఎన్నో అవకాశాలు ఇచ్చినా ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించలేదని, అలాగే వాట్సన్, రాయుడు వంటి సీనియర్లు కూడా అంతంత మాత్రంగానే రాణించిన విషయాన్ని శ్రీకాంత్ గుర్తు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో యువ క్రికెటర్లను తక్కువ చేసి మాట్లాడడం తనను ఎంతో బాధకు గురి చేసిందన్నాడు.

Krishnamachari Srikkanth Slams MS Dhoni Comments

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News