Tuesday, May 14, 2024

వైద్య సిబ్బందికే తొలుత టీకా

- Advertisement -
- Advertisement -

వివరాలు సేకరించాలని హెల్త్ విభాగానికి ప్రభుత్వం సూచన
31లోగా రోడ్‌మ్యాప్ ఇవ్వాలని ఆదేశం

Central to give Corona vaccine first to Medical staff

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే తొలుత హెల్త్ కేర్ వర్కర్లకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు వైద్యశాఖ సిబ్బంది వివరాలను సేకరించాలని వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, సహాయక సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, శానిటేషన్ వర్కర్ల పూర్తి వివరాలను సేకరించాలని ఆమె జిల్లా వైద్యాధికారులకు సూచించారు. ఇంటిపేరుతో కూడిన పూర్తిపేరు, వయస్సు, జెండర్, ఫోన్, ఆధార్ నంబర్లను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అంతేగాక వారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? దీర్ఘకాలిక రోగాలకు మందులు వాడుతున్నారా? వంటి అంశాలను కూడా నమోదు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆ వివరాలను ఈనెల 31వ తేదిలోపు హెల్త్ కార్యాలయం కోఠికి పంపించాలని ఆమె అధికారులకు చెప్పారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ అంచనా మేరకు మరో మూడు నెలల్లో కరోనాకి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని ఆ రోగ్యశాఖ అభిప్రాయప డుతోంది. అయితే వివి ధరకాల నిపుణుల సలహాలతో కరోనా వ్యాక్సిన్‌ను ముందుగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మా త్రమే ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీంతో ఈ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పట్నుంచే ప్రిపేర్ చేసుకోవాలని కమిషనర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. అంతేగాక ఈ కా ర్యక్రమాలకు ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టీంలో ఒక నోడల్ ఆఫీసర్, ఇద్దరు మెడికల్ అధికారులు, సీనియర్ డాక్టర్, ఇద్దరు స్టాఫ్ నర్సులతో పాటు ఆశాలు, అంగన్ వాడీ కార్యకర్తలను కూడా భాగస్వామ్యం చేయాలని హెల్త్ కమిషనర్ జిల్లా అధికారులు సూచించారు. వీరు ఇప్పట్నుంచే వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు వెళ్లాలని ఆమె కోరారు.

Central to give Corona vaccine first to Medical staff

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News