Monday, April 29, 2024

టేకిటీజీ పాలసీ వద్దు

- Advertisement -
- Advertisement -

PM Modi to Address the Nation

న్యూఢిల్లీ: కరోనాతో యావత్ దేశం పోరాటం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందన్నారు. మరణాల రేటు కూ డా తక్కువగా ఉందన్నారు. క రోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా కట్టడే లక్ష ంగా విధించిన జనతా క ర్ఫూ ప్రకటించినప్పటినుంచి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించడం ఇది ఏడో సారి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కరో నా వ్యాప్తి కట్టడికి మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. పండగల సీజన్ సమీపిస్తున్న వేళ ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రధాని కొన్ని సూచనలు చేశారు. ‘త్వరలోనే కరోనా పరీక్షల సంఖ్య పది కోట్లకు చేరుకుంటుంది. పరీక్షల సంఖ్య పెంచడంలో వైద్య వ్యవస్థ అత్యంత వేగంగా పని చేసింది. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది సేవాభావంతో పని చేశారు. కరోనా తగ్గుముఖం పట్టిందని నిర్లక్షంగా ఉండొద్దు. కరోనా దేశం విడిచిపోయిందనే భావన రానీయొద్దు. కరోనా తగ్గిందని భావిస్తే తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ఇటీవలి కాలంలో కొంత మంది మాస్కులు లేకుండా బైట తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు చూశాను. ఈ నిర్లక్షమే మన కొంప ముంచుతుంది. కరోనా పోయిందని భావించి మాస్కులు ధరించకపోతే ప్రమాదంలో పడినట్లే. అమెరికా, యూరప్ తదితర దేశాల్లో ఇలాంటి నిర్లక్షం కారణంగానే కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ఆ దేశాలను చూస్తే నిర్లక్షంకూడా ప్రమాదకరంగా మారవచ్చు’ అని ఆయన అన్నారు.
వ్యాక్సిన్ చివరి వ్యక్తికి చేరేదాకా కృషి
‘ప్రపంచ దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ కోసం యుద్ధ ప్రాతిపదకన కృషి చేస్తున్నాయి. శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. కొన్ని వ్యాక్సిన్లు రెండో దశలో, మరికొన్ని మూడో దశ ప్రయోగాల్లో ఉన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక చివరి వ్యక్తివరకు చేరే దాకా ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని మోడీ అన్నారు.
ఆ మూడింటినీ తక్కువగా చూడొద్దు
‘అగ్నిని, శత్రువును, వ్యాధిని తక్కువగా చూడొద్దు. వ్యాధికి మందు లభించే వరకు నిర్లక్షం చేయవద్దు. పండగల సీజన్ వచ్చేస్తోంది. ఏమాత్రం నిర్లక్షం పనికి రాదు. ఏమాత్రం నిర్లక్షం పనికి రాదు. ఏమాత్రం నిర్లక్షం వహించినా మన జీవితాలు ప్రమాదంలో పడతాయి. మీరు చేసే నిర్లక్షం కుటుంబం మొత్తాన్ని ప్రమాదంలో పడేస్తుంది. చేలో పంట ఉన్నప్పుడు ఆనందపడవద్దు. అది ఇంటికి చేరాకే సంతోషం. పండగ ఆనందం కూడా అలాంటిదే. ఈ ఆనందం ఎప్పటికీ ఉండాలంటే ఇప్పుడు మరింత జాగ్రత్త పడాలి. కరోనా కట్టడి కోసం ఆరడగుల దూరం, మాస్కు ధరించడం తప్పనిసరి’ అని ప్రధాని సూచించారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేవరకు మరింత జాగ్రత్తగా ఉందాం. కరోనా కట్టడికి ప్రజలంతా కంకణబద్ధులై ముందుకు సాగాలి.నవరాత్రులు, దసరా, దీపావళి వేళ అందరూ అప్రమత్తంగా ముందుకు వెళ్లాలి. దేశప్రజలకు దసరా, దీపావళి శుభాకాంక్షలు’ అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.

PM Modi to Address the Nation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News