Friday, May 3, 2024

ఇద్దరు భారత అమెరికన్లకు వైట్‌హౌస్‌లో కీలక పదవులు

- Advertisement -
- Advertisement -

Two Indian American women to White House Council

 

వాషింగ్టన్: వైట్‌హౌస్ కౌన్సెల్‌కు ఇద్దరు భారత అమెరికన్ మహిళలను నూతన అధ్యక్షుడు జోబైడెన్ నామినేట్ చేశారు. వైట్‌హౌస్ కౌన్సెల్‌లో అసోసియేట్ కౌన్సెల్ పదవికి నేహాగుప్తాను, డిప్యూటీ అసోసియేట్ కౌన్సెల్‌గా రీమాషాను బైడెన్ నామినేట్ చేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లోని న్యాయ అంశాల్లో వైట్‌హౌస్ కౌన్సెల్ కీలక పాత్ర నిర్వహిస్తుంది. న్యూయార్క్‌లో భారతీయ దంపతులకు జన్మించిన నేహాగుప్తా హార్వర్డ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్, స్టాన్‌ఫర్డ్ లా స్కూల్‌లో న్యాయ విద్యను పూర్తి చేశారు. శాన్‌ఫ్రాన్‌సిస్కో సిటీ అటార్నీ ఆఫీస్‌లో డిప్యూటీగా, పలు నగరాల్లోని ఏజెన్సీలకు జనరల్ కౌన్సెల్‌గా పని చేసిన అనుభవం నేహాకున్నది. ప్రస్తుతం బైడెన్‌హారిస్‌లకు అధికారాన్ని బదిలీ చేసే జనరల్ కౌన్సెల్‌లో అటార్నీగా నేహా విధులు నిర్వహిస్తున్నారు. న్యూజెర్సీకి చెందిన రీమాషా హార్వర్డ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్, యేల్ లా స్కూల్‌లో న్యాయ విద్యను పూర్తి చేశారు. రీమా గతంలో అమెరికా సుప్రీంకోర్టులో జస్టిస్ ఎలీనాకాగన్ వద్ద, యుఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్స్‌లో జడ్జి శ్రీశ్రీనివాసన్ వద్ద లా క్లర్క్‌గా పని చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News