Thursday, May 16, 2024

నిజాయితీ చాటుకున్న డ్రైవర్

- Advertisement -
- Advertisement -

Honest auto driver returned passenger handbag

ప్రయాణికురాలి విలువైన హ్యాండ్ బ్యాగును అందించిన ఆటో డ్రైవర్
అభినందించిన పోలీసులు

పంజాగుట్ట: ఆటోలో మరచిన ప్రయాణికురాలి సొత్తును నిజాయితీతో తిరిగి ఇచ్చిన ఆటోడ్రైవర్‌ను బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ అభినందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాకుత్ పురాకు చెందిన షాహిద్ బేగం తన నలుగురు పిల్లలతో పాటు తమ్ముడు తో కలసి యాకుత్ పూరా నుంచి బంజారాహిల్స్‌లోని షాలి వాహన నగర్‌కు చెందిన ఆటోలో ప్రయాణించింది. ఆమె దిగిపోయేటప్పుడు తన హ్యాండ్‌బ్యాగ్‌ను ఆటోలో మరచిపోయింది. అనంతరం ఆమె తన విలువైన ఆభరణాలు దాచిన హ్యాండ్‌బ్యాగ్‌ను ఆటోలో మరచిపోయినట్లు గుర్తించి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ డిఐ హాఫీజుద్దిన్ సీసీ కెమేరాల ఆధారంగా యాకుత్ పూరాకు చెందిన ఆటోడ్రైవర్ సమ్మద్‌ఖాన్ ఆటోగా గుర్తించారు. తెల్లవారు జామున ఆటో శుభ్రం చేస్తుండగా ఆటోలో పడిపోయిన హ్యాండ్ బ్యాగ్‌ను సమ్మద్‌ఖాన్ గుర్తించి బంజారాహిల్స్ పోలీసులకు నిజాయితీతో అందజేశాడు. దీంతో నిజాయితీగా విలువైన అభరణాలు ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను బాదితురాలు షాహిద్ బేగంకు ఇన్‌స్పేక్టర్ కళింగరావు చేతుల మీదుగా అందజేశారు. విలువైన అభరణాలను అందజేసిన డ్రైవర్ సమ్మద్‌ఖాన్‌ను ఇన్‌స్పేక్టర్ కళింగరావు అభినందించారు.

Honest auto driver returned passenger handbag

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News