Monday, May 6, 2024

మొతెరా స్టేడియానికి ప్రధాని మోడీ పేరు

- Advertisement -
- Advertisement -

మొతెరా స్టేడియానికి ప్రధాని మోడీ పేరు
స్టేడియంను ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్

Motera Stadium Renamed after PM Modi
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోని మొతెరాలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు పెట్టారు. బుధవారం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ స్టేడియాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ దీన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రధాని కలలకు ప్రతిరూపంగా అత్యాధునికి సౌకర్యాలతో ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం ఆవిష్కృత మైందన్నారు. దీంతో ఈ స్టేడియానికి ప్రధాని మోడీ పేరు పెట్టాలని నిర్ణయించినట్టు రాష్ట్రపతి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్ స్పోర్ట్ ఎన్‌క్లేవ్ భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలతో స్పోర్ట్ ఎన్‌క్లేవ్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ నిర్మాణం పూర్తయితే అహ్మదాబాద్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుందని, స్పోర్ట్ హబ్‌గా ఈ నగరం అవతరించే అవకాశాలు ఉంటాయన్నారు. మరోవైపు హోం శాఖ మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ ఈ స్టేడియం నిర్మాణంలో ప్రధాని మోడీ పాత్ర చాలా కీలకమన్నారు. ఆయన ప్రత్యేక చొరవ చూపడం వల్లే అతి పెద్ద స్టేడియం నిర్మాణం సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా ఇంగ్లండ్‌భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య బుధవారం ప్రారంభమైన డేనైట్ టెస్టు మ్యాచ్‌తో మొతెరా స్టేడియం అభిమానులకు అందుబాటులోకి వచ్చింది. కాగా, కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్‌ను ఆడుతున్న సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మను ఈ సదర్భంగా రాష్ట్రపతి కోవింద్ సత్కరించారు.

Motera Stadium Renamed after PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News