Thursday, May 16, 2024

ఆ ఔషధం ఖరీదు రూ.18కోట్లు

- Advertisement -
- Advertisement -

                          ఆ ఔషధం ఖరీదు రూ.18కోట్లు: జోల్‌గెన్‌స్మాకు బ్రిటన్ అనుమతి

లండన్: అరుదైన జన్యుపరమైన రోగానికి అత్యంత ఖరీదైన ఔషధం ‘జోల్‌గెన్‌స్మా’కు బ్రిటన్ ఆరోగ్య సేవాసంస్థ ఆమోదం తెలిపింది. నోవార్టిస్ జీన్ థెరపీస్ అనే ఔషధ కంపెనీ దీనిని తయారు చేసింది. ఈ ఔషధం ఖరీదు రూ.18 కోట్లు (17.90లక్షల ఫ్రాంక్‌లు). ఈ ఔషధాన్ని స్పైనల్ మస్కూలార్ ఆట్రో పీ(ఎస్‌ఎంఎ) అనేప్రాణాంతక జన్యులోపాన్ని సవరించేందుకు వినియోగిస్తారు. ఎస్ ఎంఎ టైప్ 1తో బాధపడే చిన్నారుల సగటు జీవితకాలం రెండేళ్లు మాత్రమే. ఈ లో పం ఉన్న చిన్నారుల్లో పక్షవాతం, కండరాల బలహీనత, అవయవాల అచేతనత్వం అ నే లక్షణాలు వ్యక్తమవుతాయి. ఒకే ఒక ఇంజెక్షన్‌తో ఎస్‌ఎంఎతో బాధపడుతున్న చి న్నారుల్లో అద్భుతమైన ఫలితాలు నమోదయ్యాయని పరిశోధకులు తెలిపారు. వెంటిలే టర్ అవసరం లేకుండానే శ్వాసించగలిగారని, సొంతంగా నేలపై పాకగలిగారని తెలిపారు. నరానికిచ్చే సింగిల్ ఇంజెక్షన్ ద్వారా ఎస్‌ఎంఎ 1కు కారణమైన జన్యు లోపం నుంచి విముక్తి పొందుతున్నారని తెలిపారు. లోపాన్ని సవరించే జన్యువు పునః స్థాపితమవుతున్నదని పేర్కొన్నారు. నరాల వ్యవస్థను చైతన్యం చేసి, కండరాల కదలిక లకు కారణమైన మాంసకృత్తులు ఈ జన్యువు ద్వారా శరీరంలో ఉత్పత్తి అవుతాయి. జోల్‌గెన్‌స్మాలో ‘వనాసెమ్నోజీన్ అబెపార్‌వొవెక్’ అనే ముడి పదార్థాన్ని వాడుతున్నా రు. ఇది ఎస్‌ఎంఎ1తో బాధపడే చిన్నారులు, లైఫ్ ఛేంజర్ ఎన్‌హెచ్‌ఎస్ సిఇఒ సర్‌సైమన్ స్టీవెన్స్ అన్నారు. ఎస్‌ఎంఎ చికిత్స కోసం 2019 మేలో స్పిన్‌రాజా అనే ఔషధానికి ఎన్‌హెచ్‌ఎస్ అనుమతి ఇచ్చింది. ఇప్పుడిది రెండోది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News