Tuesday, May 14, 2024

ఢిల్లీలో కనిష్ఠానికి కరోనా పాజిటివిటీ రేటు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రెండు నెలల కనిష్ఠానికి పడిపోయి, 1.93 శాతంగా నమోదైంది. లాక్‌డౌన్ ఆంక్షలతో ఢిల్లీ కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా 2 వేలు కన్నా తక్కువగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1491 మంది కరోనా కేసులు నమోదు కాగా, 3952 మంది కోలుకున్నారు. 130 మంది మృతి చెందారు. రాజధానిలో వ్యాక్సినేషన్ ముమ్మరం చేయడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకాను సరఫరా చేయడానికి తయారీ దారులు అంగీకరించారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు. అయితే ఏంత మొత్తం లో వ్యాక్సిన్ అందుతుందో ఆయన వివరించ లేదు. ప్రస్తుతం ఢిల్లీలో 620 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. అయితే ఫంగస్ నివారణకు కావలసిన ఆంపోటెరిసిన్ బి ఔషధం అందుబాటులో లేదని కేజ్రీవాల్ చెప్పారు.

స్పుత్నిక్ వి తయారీ దారులతో చర్చలు జరిపామని, ఎంత సరఫరా చేస్తారో ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచని వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి తమ రాష్ట్రప్రజలకు అందించ వచ్చని కేంద్రం ప్రకటించిందని, అయితే ఏ ఒక్క తయారీసంస్థ ముందుకు రాలేదని అనేక రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు ఆహ్వానిస్తున్నాయని చెప్పారు. వ్యాక్సిన్ అవసరాన్ని కేంద్రం గుర్తించాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి కరోనాపై పోరు సాగించక తప్పదన్నారు. నిరవధికంగా లాక్‌డౌన్ విధించబోమని, దీనివల్ల ఆర్థిక వ్యాపార కార్యకలాపాలు బాగా దెబ్బతింటున్నాయని, అయితే ఎలా తిరిగి కార్యాచరణ ప్రారంబించాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ చెప్పారు.

Positivity rate down in Delhi says CM Kejriwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News