Monday, May 6, 2024

పెట్రోల్,డీజిల్ ధరలు పెంపు

- Advertisement -
- Advertisement -

petrol diesel prices touch record in india

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను బుధవారం మళ్లీ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి పెంచినట్లు దేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ డేటా తెలిపింది. దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలకు ఇప్పట్లో బ్రేక్ పడేటల్లు కనిపించడం లేదు. తాజాగా లీటర్ పెట్రోల్ 26 పైసలు, డీజిల్ 27 పైసలు పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్రూ.99.32, డీజిల్ రూ.94.26కు చేరింది. చాలా జిల్లాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర సెంచరీ దాటిందిజ గుంటూరులో పెట్రోల్ రూ.101.75, డీజిల్ రూ.96.10కు చేరుకుంది. గుంటూరులో ప్రీమియం పెట్రోల్ రూ. 105.2గా ఉంది. దేశ ఆర్థికరాజధాని ముంబైలో, సవరించిన పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ .101.76, లీటరుకు. 93.85గా ఉన్నాయి. ఇంధన ధరలు వ్యాట్, సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నుల బట్టి రాష్ట్రాల్లో మారుతూ ఉంటాయి. దేశంలో పెట్రోల్, డీజిల్‌పై రాజస్థాన్ అత్యధిక వ్యాట్ వసూలు చేస్తుంది. తరువాత స్థానాల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. భారత్ లో ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ  దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల ముందు జూన్ 11 న దేశవ్యాప్తంగా సింబాలిక్ నిరసనను నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News