Thursday, May 9, 2024

త్వరలో పురుషులకు కు.ని టాబ్లెట్?

- Advertisement -
- Advertisement -

Family planning tablets for men

 

వాషింగ్టన్: పురుషుల కోసం తొలిసారి కుటుంబ నియంత్రణ టాబ్లెట్(మాత్ర) త్వరలోనే సిద్ధం కానుంది. ఈ పరిశోధనలకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సాయం అందిస్తున్నారు. ఇందుకోసం రెండేళ్లలో 17 లక్షల డాలర్లను ఆయన అందించనున్నారు. కండోమ్ అభివృద్ధి తర్వాత పురుషుల కోసం కుటుంబ నియంత్రణ సాధనాలేవీ రూపొందలేదని స్కాట్లాండ్‌లోని దుండీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త క్రిస్ బారాట్ తెలిపారు. ఫలితంగా అవాంఛిత గర్భాల నుంచి రక్షణ భారం ఎక్కువగా మహిళలపైనే పడుతోందన్నారు. ఈ అసమానత్వాన్ని తాము సరి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

రెండేళ్లలోగా సరైన మాత్రను కొనుగొని, మొదటి దశ ప్రయోగాల దశకు చేరుకుంటామని చెప్పారు. వీర్య కణ జీవశాస్త్రంపై శాస్త్రవేత్తలకు పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం. వీర్య కణంలో కీలక విధులకు తోడ్పడే ముఖ్య ప్రొటీన్‌ను గుర్తించే అధ్యయనాలు జరగకపోవడం విషయంలో అడ్డంకుడులు ఉన్నాయన్నారు. ఈ ఇబ్బందులను అధిగించడానికి దుండీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చిన్నపాటి, సమాంతర పరీక్ష వ్యవస్థను అభివృద్ధి చేశారు. అందులో వేగవంతమైన మైక్రోస్కోపు, ఇమేజ్ ప్రాసెసింగ్ సాధనాలు ఉంటాయి. అవి మానవ వీర్య కణాల వేగవంతమైన కదలికలను అత్యంత కచ్చితత్వంతో గుర్తిస్తాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News