Saturday, April 27, 2024

నా జీవితంలో ఇలాంటి చార్జిషీటు చూడలేదు

- Advertisement -
- Advertisement -

CJI Ramana comments on Rajasthan soldier case

భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపే ప్రయత్నం చేయరా?
రాజస్థాన్ సైనికుడి కేసులో సిజెఐ రమణ వ్యాఖ్యలు, పోలీసు దర్యాప్తు తీరుపై ఆగ్రహం

న్యూఢిల్లీ: రాజస్థాన్‌కు చెందిన ఓ సైనికుడి కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు పలు అనుమానాలు వ్యక్తంచేసింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేసే అవకాశాన్ని పరిగణనలో తీసుకోవాలని రాజస్థాన్ ప్రభుత్వానికి సూచించింది. సైనికుడు వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా సొంత భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపే ప్రయత్నమైనా చేయకుండా వీడియోలో చిత్రీకరించడాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్‌ల ధర్మాసనం తప్పుపట్టింది. రాజస్థాన్ హైకోర్టు తనకు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా దానిని సిజెఐ ధర్మాసనం గురువారం విచారించింది. తన న్యాయవాద వృత్తి జీవితంలో ఇలాంటి ఛార్జిషీటును ఇంతవరకు చూడలేదని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు.

రాజస్థాన్‌లోని ఆల్వార్‌కు చెందిన సాహాబుద్దీన్ అనే సైనికుడు ఒక చిన్న తగాదాతో తన భార్య ఆత్మహత్యకు కారకుడైనట్లు అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. స్వయానా నిందితుని కుమార్తె ఇచ్చిన వాంగ్మూలం కూడా అతని ప్రమేయాన్ని చాటుతోందని, కీలక నిందితుల వాంగ్మూలాలు నమోదు చేసేవరకు బెయిల్ పిటిషన్‌ను అనుమతించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆల్వార్‌కు చెందిన సాహాబుద్దీన్ అనే సైనికుడు ఒక చిన్న తగాదాతో తన భార్య ఆత్మహత్యకు కారకుడైనట్లు అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. స్వయానా నిందితుని కుమార్తె ఇచ్చిన వాంగ్మూలం కూడా అతని ప్రమేయాన్ని చాటుతోందని, కీలక నిందితుల వాంగ్మూలాలు నమోదు చేసేవరకు బెయిల్ పిటిషన్‌ను అనుమతించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌ను వెనక్కి తీసుకునే అవకాశాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాదికి ఇవ్వలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News