Saturday, May 4, 2024

ఆది పినిశెట్టి బహుముఖ నటుడు

- Advertisement -
- Advertisement -

ఆది పినిశెట్టి అథ్లెట్‌గా నటిస్తోన్న సినిమా ‘క్లాప్’ విడుదలకు సిద్ధమైంది. ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. “తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘క్లాప్’ టీజర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. నా స్నేహితుడు, దర్శకుడు రవి రాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి ఒక బహుముఖ నటుడు. ఇందులో ఆది ఒక ఛాలెంజింగ్ పాత్ర పోషించాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నాను”అని అన్నారు. పృథ్వి ఆదిత్య దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజీ (సర్వంత్ రామ్ క్రియేషన్స్), ఎం.రాజశేఖర్ రెడ్డి (శ్రీ షిర్డీ సాయి మూవీస్) కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘CLAP’ Movie Teaser launched by Chiranjeevi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News