Thursday, May 16, 2024

యుపిలో దళిత మహిళపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Mass rape of a minor girl for 8 months in thane

నోయిడా: ఉత్తర్ ప్రదేశ్‌లోని జెవార్ ప్రాంతంలో ఒక మధ్యవయస్కురాలైన దళిత మహిళ సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. ఆదివారం ఉదయం గ్రామ పొలిమేరల్లోని పంటపొలాలలో పశుగ్రాసం కోయడానికి వెళ్లిన దళిత మహిళపై పశువులు మేపడానికి అక్కడకు వచ్చిన అదే గ్రామానికి చెందిన 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడితోపాటు మరికొందరు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు డిసిపి వృందా శుక్లా చెప్పారు. బాధితురాలు తరచు ఆ ప్రాంతానికి వెళ్లి పశుగ్రాసం కోస్తుంటుందని, ప్రధాన నిందితుడు కూడా అక్కడకు వెళుతుంటాడని, వారిద్దరూ పరిచయస్తులేనని ఆమె చెప్పారు. డ్రగ్స్‌కు బానిసైన నిందితుడు ఆమెను పొలాల్లోకి ఈడ్చుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని డిసిపి తెలిపారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, ఇతర నిందితుల పాత్రపై దర్యాప్తు జరుగుతోందని ఆమె తెలిపారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News