Wednesday, May 1, 2024

శంషాబాద్‌లో రూ.3 కోట్ల బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Gold worth Rs 3 crore seized in Shamshabad

ఎమర్జెన్సీ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ లైట్‌లో ఆరు కిలోల బంగారు బిస్కెట్ల స్వాధీనం

మనతెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ లైట్‌లో దాచి తరలిస్తున్న రూ. 3 కోట్ల విలువ చేసే ఆరు కిలోల బంగారాన్ని మంగళవారం నాడు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులు నుంచి ఆరు కిలోల బంగారాన్ని లగేజీ బ్యాగ్‌లోని ఎలక్ట్రిక్ ఛార్జింగ్ లైట్‌లో బిస్కెట్ల రూపంలో బంగారం తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు ముందస్తుగా పక్కా సమాచారం అందింది. దీంతో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు ప్రయాణీకుల నుంచి రూ.3 కోట్లు విలువ చేసే ఆరుకిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు.

కాగా ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. దుబాయ్ నుంచి ఇకె 524 విమానంలో శంషాబాద్ వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎమర్జెన్సీ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ లైట్‌లో భారీ ఎత్తున బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు ప్రయాణీకులకు చెందిన లగేజీపై నిఘా వేశారు. ఈక్రమంలో దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుంచి కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో ఎమర్జెన్సీ లైట్ ను తూకం వేశారు.

కాగా ఎమర్జెన్సీ లైట్ ఉండాల్సిన బరువు కన్నా 6 కేజీల బరువు ఎక్కువుగా వుండడంతో లైట్ ను కస్టమ్స్ అధికారులు ఒపెన్ చేసారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ లైట్ బ్యాటరీలో ఎలక్ట్రికల్ పరికరాల రూపంలో ఉన్న 6 కేజీల బంగారు బిస్కట్లను దాచినట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకుని వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసిన అధికారులు గతంలో వీరిపై బంగారం తరలింపు కేసులున్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News