Monday, May 6, 2024

రోమ్ కు చేరుకున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

రోమ్: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఇటలీలోని రోమ్ కు చేరుకున్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగి ఆహ్వానం మేరకు ఆయన అక్టోబర్ 29 నుంచి 31 వరకు ఇటలీ రాజధాని రోమ్, వాటికన్ సిటీ సందర్శించనున్నారు. అంతేకాక ప్రధాని మోడీ ఇంగ్లాండ్‌లోని గ్లాస్గోకు కూడా పర్యటించనున్నారు. అక్కడ ఆయన నవంబర్ 1-2 తేదీల మధ్య జరిగే గ్లాస్గో వాతావరణ సదస్సుకు హాజరవుతారు. ప్రధాని మోడీ యూరొపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఛార్లెస్ మైఖేల్ , యూరొపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్‌తో కూడా చర్చించనున్నారు. అయితే మోడీ ప్రధాన ఎజెండా ఇటలీలో జరిగే జి-20 సదస్సులో పాల్గొనడమే. ప్రధాని మోడీ ఈ పర్యటన సందర్భంగా సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో కూడా చర్చలు జరపనున్నారు.
ప్రధాని మోడీ వాటికన్ సిటీని కూడా సందర్శించనున్నారు. ఆయన పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ కానున్నారని తెలుస్తోంది. ప్రధాని మోడీ, పోప్ ఫ్రాన్సిస్ అక్టోబర్ 30న ఉదయం 8.30 గంటలకు అనధికారికంగా సమావేశం అవుతారని కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ తెలిపింది. అంతేకాక ప్రధాని కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పారోలిన్‌తో కూడా సమావేశం కానున్నారని వారు తెలిపారు.
తన ఈ పర్యటనకు సంబంధించి మోడీ ట్వీట్ కూడా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News