Monday, May 6, 2024

సఖీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే

మన తెలంగాణ/నిర్మల్ ప్రతినిధి : సఖీ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశాన్ని జిల్లా పాలనాధికారి కార్యాలయంలో అదనపు కలెక్టర్ హే మంత్ బోర్కడే అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సఖీ కేంద్రం వన్ స్టాఫ్ సెంబర్ అందిస్తున్న సేవలను జిల్లావ్యాప్తంగా అవాగహణ కల్పించాలన్నారు. డోమెస్టిక్ వైలెన్స్ కేసులు పరిష్కరించడంలో సరైన కౌన్సలింగ్ అవసరమని అలాంటి కేసులు కౌన్సిలింగ్ చేసి పరిష్కరించే దిశగా చూడాలన్నారు.

సఖీ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న మహిళలకు ఉచితంగా సేవ లు అందిస్తుందని తెలిపారు. 181 మహిళా హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి సలహాలు, రక్షణ పొందాలన్నారు. ఇంత వరకు జరిగిన కేసుల వివరాలు పరిష్కారమైన కేసుల వివరాలు, సఖీ ద్వారా కోర్టుకు పంపిన, పోలీస్ స్టేషన్‌లో పంపినా తదితర వివరాల పై కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఓ విజయ లక్ష్మీ, డిఈఓ రవీందర్, డిపిఒ వెంకటేశ్వర్లు, డిఎం అండ్‌హెచ్‌ఓ ధనరాజ్, షీ టీమ్ ఎస్సై సుమన్, న్యాయవాది మాదవి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News