Wednesday, May 1, 2024

ఎమోషనల్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

హీరో విజయ్ ఆంటోనీ డిఫరెం ట్ కథాంశంతో తెరకెక్కిన ‘విక్రమ్ రాథోడ్‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పెప్సి శివ సమర్పణలో విజయ్ ఆంటోని కథానాయకుడిగా, రెమి సెస్ హీరోయిన్‌గా సురేష్ గోపి, సోనూసూద్, యోగిబాబు నటీ నటులుగా తమిళ దర్శకుడు బాబు యోగేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న తమిళరసన్ సినిమా తెలుగులో ‘విక్రమ్ రాథోడ్‘ అనే టైటిల్‌తో డబ్ అవుతోంది. ఈ సినిమాను తెలుగులో రావూరి వెంకట స్వామి విడుదల చేస్తున్నారు. ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లా డుతూ “ఎమోషనల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన మా ‘విక్రమ్ రాథోడ్‘ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. మా సినిమాకు గాన గంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన‘ కన్నా.. దిగులవకు తొడు న్నా.. నీ కొరకు’ అనే పాట హైలెట్‌గా నిలుస్తుంది. మంచి కాన్సెప్టుతో వస్తున్న ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడవచ్చు. ఇందులో ఉన్న యాక్షన్ సన్నివేశాలు, విజయ్, సోనూసూద్‌ల మధ్య సాగే పోరాట ఘట్టాలు ఆసక్తికరంగా ఉంటాయి”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News