Wednesday, May 8, 2024

‘వాసివాడి తస్సాదియ్య’

- Advertisement -
- Advertisement -

Vasivadi Tassadiya song released from bangarraju

 

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న ‘బంగార్రాజు’ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా తాజాగా పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ ‘వాసివాడి తస్సాదియ్య’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నాగార్జున, నాగచైతన్య కలిసి ఇందులు స్టెప్పులు వేస్తుండగా, ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బంగార్రాజుకు పెళ్లయిపోతుందనే బాధను ఫరియా అబ్దుల్లా ఈ పాటలో వివరిస్తుంది. ఈ పాటను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల రచించారు. మోహన భోగరాజు, సాహితి చాగంటి, హర్షవర్దన్ చావలి కలిసి ఆలపించారు. నాగార్జున పంచెకట్టులో కనిపిస్తుండ, నాగచైతన్య మోడ్రన్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఫరియా మాత్రం ఐటం గర్ల్‌గా కనిపించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News