Friday, September 26, 2025

శుక్రవారం రాశిఫలాలు (26-09-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – ముఖ్యమైన కార్యక్రమాలలో ఏర్పడిన అవరోధాలు తొలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం.

వృషభం – ప్రజా సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు. లలిత కళల పట్ల అభిరుచి కనబరుస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు, సాఫ్ట్వేర్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది.

మిథునం – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు.

కర్కాటకం – అనుకోని అవకాశాలు లభిస్తాయి. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. కుటుంబ సభ్యుల నుండి సహాయం అందుతుంది. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు.

సింహం – ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. ఉద్యోగులకు స్థానమార్పులు వుంటాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు

కన్య – వృత్తి- వ్యాపారాలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. రాజకీయ, కళా రంగాల వారికి సన్మానాలు. బంధువుల నుండి ధన, వస్తు లాభాలు పొందగలుగుతారు.

తుల –  వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది.

వృశ్చికం – ముఖ్యమైన కార్యక్రమాలలో ఏర్పడిన అవరోధాలు తొలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటుపోటులను అధిగమిస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు.

ధనుస్సు – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి.

మకరం – నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహాకారాలు అందుతాయి. కొంత మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది.

కుంభం – పనులలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.

మీనం – ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు.

Weekly rasi phalalu next week

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News