Monday, April 29, 2024

నీరు లేక వెలవెలబోతున్న జూరాల జలాశయం

- Advertisement -
- Advertisement -

గద్వాల: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు రైతులకు సాగు, తాగునీరు అందిస్తున్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జూలై నెల దాటుతున్న నీరు లేక వెలవెలబోతున్నది. ఈ సారి ఖరీఫ్‌లో సాగు చేయాలనుకున్న రైతన్నలు పంట సాగులో వెనుక పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. జూరాల ప్రాజెక్టులో కృష్ణమ్మ గలగలలు ఉండాల్సి ఉండగా నీరు లేక విలువలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూరాల ప్రాజెక్టు పైనే ఆధారపడిన బీమా, నెట్టెంపాడు, ఎత్తిపోతల పథకాలు దయనీయ స్థితిలో మారాయి. నైరుతిపై ఆశలు పెట్టుకున్న రైతన్నలకు పవనాలు నిరాశ పర్చడంతో జూలై మాసంలోనే కొన్ని రిజర్వాయర్లు నిండాల్సి ఉండగా వెలవెలపోతున్నాయి.

ఈ మాసంలో సగం రిజర్వాయర్లు నిండగా ఈసారి మాత్రం చినుకు, వరద జాడలేదు. ఎగువ ప్రాంతమైన కర్ణాటక, మహరాష్ట్రల నుండి వరదలు సంభవించి జూరాల ప్రాజెక్టుకు రావాల్సి ఉండగా అక్కడ సరైన వర్షాలు లేక ప్రాజెక్టుకు నీరు రావడం లేదు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 9.6 టీఎంసీలు కాగా ప్రసుత్తం 3.40 ఎంసీల నీరు ఉంది. కుడి కాలువ ద్వారా ఒక లక్ష ఇరవై వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 60 క్యూసెక్కుల నీరు వినియోగంలో ఉంటుంది. జూరాల నుండి సాగు, తాగునీటికై 80 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలి. ఈసారి వరద లేదు .. వాన లేదు దీంతో రిజర్వాయర్లు నిండేది ఎట్లా సాగు, తాగునీరు పారేది ఎట్లా అని నడిగడ్డ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికే కాల్వల కింద నారు పోయాల్సిన రైతులు నీరు కాలువలకెప్పుడు వస్తుందా … ఎప్పుడు పోద్దామని ఎదురు తెన్నులు చూస్తున్నారు. జూరాల ప్రాజెక్టు కింద నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా గుడెను దొడ్డి, ర్యాలంపాడు, తాటికుంట, నాగర్‌దొడ్డి, ముచ్చోనిపల్లి రిజర్వాయర్లు ఉన్నాయి. అంతేగాక మిషన్ భగీరథ ద్వారా తాగునీరు రేవులపల్లి డ్యాం నుండే కొనసాగుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News