Monday, May 6, 2024

బాలుడికి సోనూసూద్ భారీ సాయం

- Advertisement -
- Advertisement -
Actor Sonu Sood Helps Telangana Boy
రూ.20లక్షల వైద్య ఖర్చులకు హామీ

ముంబై : బాలీవుడ్ నటుడు సోనూసుద్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణకు చెదిన బాలుడికి వైద్య సహాయం కోసం ముందుకొచ్చారు. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలం పెరుమాండ్లకు చెందిన బాలుడు హర్షవర్ధన్ లివర్ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు సోనూసుద్‌ను కలిసి వైద్యానికి రూ.20 లక్షలు ఖర్చవుతుందని వివరించారు. దీంతో చలించిపోయిన సోనూసూద్ బాలుడి వైద్య ఖర్చులు భరిస్తానని వారికి హామీ ఇచ్చారు. కుటుంబానికి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.

Actor Sonu Sood Helps Telangana Boy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News