Tuesday, April 30, 2024

‘మేజర్’ ఫస్ట్ లుక్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న అడవి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మేజర్’. గురువారం అడవి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఆయన ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. 6/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత నేప‌థ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సూపర్ స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు. ‘గూఢ‌చారి’ ఫేం శ‌శికిర‌ణ టిక్కా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో అడవి శేష్ సరసన శోభితా దూళిపాళ్ల హీరోయిన్ గా న‌టిస్తుంది. దాదాపు చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది.

Adivi Sesh MAJOR Movie First Look Release

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News