Saturday, April 27, 2024

రాష్ట్రంలో త్వరలో మొబిలిటీ వ్యాలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రపంచస్థాయి అధునాతన ఆటో విడిభాగాల తయారీ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్ర త్యేకంగా ఒక మొబిలిటి వ్యాలీని సృష్టించేందుకు కృషి చే స్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. మొత్తం ఐదు జోన్‌లతో మొబిలిటి వ్యాలీ ఏ ర్పాటు చేస్తామన్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మం డలంలోని యెంకతలలో ఈ వ్యాలీని నెలకొల్పుతున్నట్లు పే ర్కొన్నారు. బహుళ ఆటోమోటివ్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ త యారీదారుల (ఒఇఎం) భాగస్వామ్యంతో మొబిలిటీ వ్యా లీ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.తద్వారా అడ్వాన్స్‌డ్ ఆటో విడిభాగాలకు రాష్ట్రం గమ్యస్థానంగా మారుతుందన్నారు. ఐటి, పరిశ్రమల రంగానికి రాష్ట్ర ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా నే శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక రంగంలో తె లంగాణ గణనీయమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. ఫలితంగా ఐటి ఎగుమతులు రాష్ట్రం నుంచి భారీగా పెరిగాయన్నారు.

ఇండియాలో మూడవ వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌లో క్రియేట్ అవుతున్నాయని తెలిపారు. బుధవారం నగర పరిధిలోని రాయదుర్గంలో ప్రముఖ బోష్ గ్లోబల్ సాఫ్టవేర్ టెక్నాలిజీస్ సంస్థకు చెందిన స్మార్ట్ క్యాంపస్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బోష్ కంపెనీ క్యాంపస్ కారణంగా నగరానికి మరింత ఖ్యాతి పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం అందిస్తున్నామన్నారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేక దృష్టి సారించామమన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే సిఎం కెసిఆర్ లక్షమన్నారు. అందుకు తగిన వేగంతోనే నగరాభివృద్ధి జరుగుతోందన్నారు. పారిశ్రామిక వేత్తల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా కొనసాగుతున్న కారణంగానే రాష్ట్రానికి పరిశ్రమలు పరుగులు తీస్తున్నాయన్నారు. దీని వల్ల రాష్ట్రానికి కేవలం పెట్టుబడులే కాకుండా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయని కెటిఆర్ వివరించారు.

దీని కారణంగానే నగరంలో గత ఏడాదిన్నరలో లక్షన్నర ఉద్యోగాలు సృష్టించినట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో హయ్యెస్ట్ గ్రోత్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినట్లు పేర్కొన్నారు. ఆటోమొబైల్ రంగంలో అతి పెద్ద కంపెనీ అయిన బోష్ తెలంగాణాలో నూతన ఆఫీస్ పెట్టడం వల్ల మన ఖ్యాతిని మరింత పెంచిందన్నారు. స్టార్టప్ రంగంలో అద్భుతంగా ముందుకు వెలుతున్న తెలంగాణ టాలెంట్ జోన్‌గా అవతరించిందన్నారు. న్యూ ఏజ్ మొబైల్స్ కార్లలోనూ సాఫ్ట్‌వేర్ పెరుగుతోందన్నారు. క్వాల్కామ్ లాంటి సెమీ కండెక్టర్ కంపెనీలు సైతం హైదరాబాద్ నగరంలో దూసుకుపోతున్నాయన్నా రు. కాగా హైదరాబాద్‌లో ఫార్ములా..-ఇ ను ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు కెటిఆర్ తెలిపారు. ఇండియాలో ఆ ఈవెంట్‌ను నిర్వహిస్తున్న తొలి నగరం హైదరాబాద్ అని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోష్ సంస్థకు చెందిన పలువురు ప్రతినిధులతో పాటు సంబంధత విభాగం అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News