Monday, May 6, 2024

ఆ సత్తా అఫ్గాన్‌కు ఉంది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : త్వరలో జరుగనున్న ట్వంటీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ ట్రోఫీని సాధించినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ట్వంటీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ చాలా బలమైన జట్టు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచు కోవాలన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు అఫ్గాన్‌కు అందుబాటులో ఉన్నారన్నాడు. రషీద్ ఖాన్, మహ్మద్ నబి, ముజీబుర్ రహ్మాన్‌లతో అఫ్గాన్ చాలా బలమైన జట్టు అనడంలో సందేహం లేదన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని లీగ్‌లలో నిలకడైన ప్రదర్శన చేస్తున్న ఘనత ఒక్క రషీద్ ఖాన్‌కు మాత్రమే దక్కుతుందన్నాడు. ఇక యుఎఇ పిచ్‌లపై కూడా రషీద్‌కు ఎంతో అవగాహన ఉందన్నాడు. దీంతో అతని నేతృత్వంలో అఫ్గాన్ సంచలన విజయాలు సాధించినా ఆశ్చర్యం లేదన్నాడు. ఇతర జట్లతో పోల్చితే అఫ్గాన్ పొట్టి ఫార్మాట్‌లో చాలా మెరుగైన జట్టుగా ఉందన్నాడు. ఇక ఆ దేశంలో నెలకొన్న అల్లకల్లోల వాతావరణం నేపథ్యంలో మెరుగైన ఆటతో ఆ దేశ పాలకుల దృష్టిని ఆకర్షించాలనే పట్టుదలతో అఫ్గాన్ క్రికెటర్లు ఉన్నారు. దీంతో అఫ్గాన్ ట్రోఫీని సాధించే అవకాశాలు కొట్టి పారేయలేమని గంభీర్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News