Monday, April 29, 2024

మళ్లీ వైరస్ ముప్పు!

- Advertisement -
- Advertisement -
Again covid-19 threat in telangana
బోనాల ఉత్సవాల్లో కొవిడ్ నిబంధనలు పాటించని జనం
మాస్కులు ధరించకుండా గుంపులుగా చేరుతున్న పరిస్థ్దితి
జాగ్రత్తలు పాటించకపోతే మరోసారి మహమ్మారి విజృంభణ తప్పదు
ప్రజలు నిర్లక్షం చేయరాదని సూచిస్తున్న జిల్లా వైద్యాధికారులు

హైదరాబాద్: నగరంలో కరోనా సెకండ్ తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకున్న ప్రజలపై మళ్లీ ఆషాడ బోనాలతో వైరస్ ఉనికి చాటుకునే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 11 నుంచి గోల్కొండ బోనాల ఉత్సవాలు ప్రారంభకావడంతో స్థ్దానికులు పెద్ద ఎత్తున అమ్మకు బోనం సమర్పించేందుకు అట్టహాసంగా ఊరేగింపుతో వచ్చారు. గుంపులుగా జనం చేరడంతో అందులో ఒకరికి దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న సమీపంలోని అందరికి వ్యాప్తిస్తుందని జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తప్పకుండా ముఖానికి మాస్కులు, వ్యక్తుల మధ్య బౌతికదూరం పాటించాలని, నిర్లక్ష్యం చేస్తే మహమ్మారి మరోసారి విశ్వరూపం దాల్చే వాతావరణం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

వరుస ఆదివారాలు పాతబస్తీ, సికింద్రాబాద్ మహంకాళి, అంబర్‌పేట అమ్మవారు బోనాలు ఉండటంతో గత ఏడాదిలో కరోనా కారణంగా బోనాలు పండగను ఇంటిలో చేసుకున్నారు. ఈసారి అమ్మకు బోనం సమర్పించేందుకు ప్రభుత్వం వీలు కల్పించడంతో నగర ప్రజలు ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు సిద్దమైతున్నారు. గత పదిరోజుల నుంచి గ్రేటర్ నగరంలో పాజిటివ్ కేసులు 100 నుంచి 70 కేసుల వరకు చేరాయని, ఈనెలాఖరు వరకు పూర్తిగా తగ్గే అవకాశముందని వైద్యాధికారులు భావిస్తుండగా, వర్షాలు, బోనాల ఉత్సవాలతో మళ్లీ మహమ్మారి రెక్కలు కట్టుకునే పరిస్దితి ఎక్కువగా ఉందంటున్నారు. వైరస్ ప్రభావం చూపకుండా బోనాల వేడకల్లో పాల్గొనే వారికి లక్షణాలు కనిపిస్తే దూరంగా ఉంచాలని, ఆరోగ్యంగా ఉన్నవారే ఉత్సవాల్లో విన్యాసాలు చేసేలా చూడాలని ఉత్సవ కమిటీ సభ్యులకు అధికారులు సూచిస్తున్నారు.

చిన్నారులను పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి :వైద్యులు

సెకండ్‌వేవ్ ప్రభావం తగ్గిన థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపే ప్రభావం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే హెచ్చరించిందని అందుకోసం తల్లిదండ్రులు చిన్నారుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని నిలోఫర్ వైద్యులు సూచిస్తున్నారు.
సామూహికంగా ఉంటే పెద్దల కంటే పిల్లలకు వైరస్ తొందరంగా సోకే అవకాశముందని, అందుకోసం పిల్లలను దూరంగా ఉంచాలని, ఒకే వేళ జలుబు, దగ్గు వంటివి కనిపించిన వెంటనే పరీక్షలు చేయించి వైద్యచికిత్స అందించాలని పేర్కొంటున్నారు.అదే విధంగా బస్తీదవఖానలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో టెస్టులతో పాటు, మందుల కిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయని, వాటిని అవసరమైన వారు వైద్యుల సలహా మేరకు తీసుకుని ఆరోగ్యం సమస్యలు రాకుండా చూడాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News