Monday, April 29, 2024

హాత్రస్ ఘటన కేసు: యూపి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..

- Advertisement -
- Advertisement -

Allahabad HC Issues Notice to UP Govt in Hathras Incident

లక్నో: హాత్రస్ ఘటన కేసుపై అలహాబాద్ లక్నో బెంచ్ విచారణ పూర్తైంది. ఈ కేసులో ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బలవంతంగా తమ కూతురి అంత్యక్రియలు పూర్తి చేశారని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులు స్టేట్మెంట్ రికార్డు చేసిన హైకోర్టు యూపి సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 2వ తేదీకి వాయిదా పడింది. అంతకుముందు హాత్రస్ ఘటనపై అలహాబాద్ హైకోర్టులో విచారణకు హాత్రస్ జిల్లా అధికారులతోపాటు బాధితురాలు కుటుంబసభ్యులు హాజరయ్యారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య బాధితురాలి కుటుంబసభ్యులను హైకోర్టు బెంచ్ ఎదుట హాజరపర్చారు. హాత్రస్ లో 20 ఏళ్ల దళిత అమ్మాయిపై అగ్రకులాలకు చెందిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతిచెందింది. అయితే, పోలీసులు హడావిడిగా మృతదేహాన్ని అర్థరాత్రి హాత్రస్ కు తీసుకువచ్చి.. కనీసం కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా అంత్యక్రియలు చేశారు. అయితే, పోలీసులు తమను గృహ నిర్భందం చేసి అంత్యక్రియలు చేశారని బాధితురాలి కుటుంబసభ్యలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ అడిషనల్ ఛీఫ్ సెక్రటరీతోపాటు అడిషనల్ డిజిపిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఎదుట హాజరై ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Allahabad HC Issues Notice to UP Govt in Hathras Incident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News