Thursday, May 16, 2024

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ

- Advertisement -
- Advertisement -

Allantha doorana movie motion poster release

 

గతంలో బాలనటుడిగా, ఆ తర్వాత హీరోగా తానేంటో నిరూపించుకున్న విశ్వ కార్తికేయ తాజాగా నటించిన చిత్రం ‘అల్లంత దూరాన’. ఇందులో ఆయనకు జోడీగా ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ నాయికగా నటించింది. చలపతి పువ్వల దర్శకత్వంలో ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కోమలి సమర్పణలో నిర్మాత ఎన్.చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు బాబి విడుదల చేశారు. అనంతరం బాబి మాట్లాడుతూ “మోషన్ పోస్టర్ చాలా బావుంది.

మంచి విజువల్స్, మెలోడీ మ్యూజిక్ సమ్మేళనంతో ప్రేక్షకులను అలరించే సినిమాగా ఇది అనిపిస్తోంది”అని అన్నారు. చిత్ర దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రమిదని తెలిపారు. నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ “ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం. హైదరాబాద్‌తో పాటు కార్వేటినగరం, పుత్తూరు, తిరుపతి, ఆర్.కె.వి.పేట, కేరళ, చెన్నై, పాండిచ్చేరి తదితర లొకేషన్లలో షూటింగ్ చేశాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో విశ్వ కార్తికేయతో పాటు చిత్ర బృందం పాల్గొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News