Tuesday, April 30, 2024

దళితబంధు పథకం దేశంలో ఎక్కడా లేదు

- Advertisement -
- Advertisement -

Allegations against Dalit Bandhu should be avoided:Motkupalli

అడ్డుకోవడానికి ప్రతిపక్ష పార్టీల కుట్రలు
దళితబంధుపై ఆరోపణలు మానుకోవాలి
ప్రతిపక్షాల తీరుకు నిరసనగా నేడు నిరసన దీక్ష చేపడుతున్నా
మాజీ మంత్రి, టిఆర్‌ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు

మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశంలో ఎక్కడా లేదని, దానిని అడ్డుకోవడం ప్రతిపక్ష పార్టీల కుట్రలో భాగమేనని మాజీ మంత్రి, టిఆర్‌ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ప్రతిపక్షాలు ఆరోపణలను ఖండిస్తూ నేడు ఉదయం 9 గంటలకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం తన ఇంట్లో (ఒక్కరోజు) నిరసన దీక్షను సాయంత్రం 5 గంటల వరకు చేపడతానని, అనంతరం దీక్షను మిరమిస్తానని ఆయన తెలిపారు. సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుతో దళితజాతిలో వెలుగులు నిండుతున్నాయన్నారు. దళిత బంధు ఎందుకు అమలు చేస్తున్నారని ప్రతిపక్షాల తీరు ఉందని, వారిని చూస్తే బాధ అనిపిస్తుందన్నారు.

తన చివరి రక్తపు బొట్టు ఉంన్నంత వరకు దళితలకు మేలు చేసే విధంగా పని చేస్తానని సిఎం కెసిఆర్ చెప్పారని, అవి చాలా గొప్ప మాటలని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు దళితబంధుపై అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి దళిత దీక్షలు చేస్తున్నాడని, ఆయన దళితుల గురించి మాట్లాడం సిగ్గు చేటన్నారు. రేవంత్‌రెడ్డి స్వగ్రామంలో ఆయన ఇంటి ముందు నుంచి దళితులు చెప్పులు వేసుకొని నడవనీయని రేవంత్‌రెడ్డి దళిత జాతి గురించి మాట్లాడడం విడ్డ్డూరంగా ఉందన్నారు.ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ తాను నేడు ఉదయం దీక్ష చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News