Wednesday, May 8, 2024

రాత్రి 7 గంటలకు రైతులను కలవనున్న అమిత్ షా

- Advertisement -
- Advertisement -

Amit Shah called the farmers for talks

న్యూఢిల్లీ: రైతు సంఘాల పిలుపు మేరకు మంగళవారం దేశవ్యాప్తంగా బంద్ కొనసాగింది. అన్ని పార్టీల మద్దతుతో బంద్ విజయవంతంగా ముగిసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. రైతు సంఘాల నేతలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చలకు పిలిచారు. ఇవాళ రాత్రి 7 గంటలకు చర్చలకు రావాలని రైతు సంఘాల నేతలకు ఆహ్వానించారు. కాగా రైతుల ఆందోళనలను వీలైనంత త్వరగా చల్లార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ చర్చలు బుధవారం జరగాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర, రైతుల మధ్య 5సార్లు చర్చలు జరిగినా అసంపూర్తిగానే ముగిసిన విషయం తెలిసిందే. మరి అమిత్ షాతో భేటీ అనంతరం రైతు సంఘాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి మరి. అయితే దేశానికి అన్నం పెట్టే రైతులను నట్టేట ముంచే నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించే వరకు ఉద్యమం ఆగదని లెఫ్ట్ పార్టీలు తేల్చి చెప్పాయి. సిఎం కెసిఆర్ పిలుపు మేరకు భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతూ ప్రకటించింది. తెలంగాణ మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని బంద్ ను విజయవంతం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News