Wednesday, May 1, 2024

జోరుగా… హుషారుగా

- Advertisement -
- Advertisement -

సంచలన కథానాయకుడు విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ మూవీ షూటింగ్ ముంబయ్‌లో శరవేగంగా జరుగుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ స్క్రిప్ట్‌కు ఫిదా అయిన కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాణ భాగస్వాములుగా ఈ ప్రాజెక్టులో చేరారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ విషయంలో పూరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో హీరోయిన్ అనన్య పాండే కూడా చేరింది. బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన అనన్య… విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. ముంబయ్‌లో ఆర్ట్ డైరెక్టర్ జానిషేక్ బాషా నిర్మించిన భారీ సెట్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్‌తో పాటు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ యాక్షన్ సినిమాను నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, రోణిత్ రాయ్, విష్ణురెడ్డి, అలీ, గెటప్ శ్రీను కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీని ధర్మా ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. ఈ చిత్రానికి కెమెరామెన్: విష్ణు శర్మ, స్టంట్ మాస్టర్: కిచ, ఎడిటర్: జునైద్ సిద్ధిఖ్.

Ananya panday to opposite Vijay Deverakonda’s Fighter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News