Tuesday, May 7, 2024

100 బిట్‌కాయిన్స్ ఇవ్వకుంటే పేల్చేస్తాం: ముంబై లగ్జరీ హోటళ్లకు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

ముంబయి: బాంబుతో పేలుస్తామని హోటళ్లకు ఈమెయిల్ హెచ్చరిక రావడంతో ముంబయిలోని నాలుగు లగ్జరీ హోటళ్లను బుధవారం క్షుణ్ణంగా పరిశీలించారు. ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబా సభ్యుడినని ఈ మెయిల్ పంపిన వ్యక్తి పేర్కొన్నాడు. బెదిరింపు ఈ మెయిల్స్ రావడంతో హోటళ్లలో సమగ్రంగా తనిఖీలు నిర్వహించారని, అయితే అనుమానాస్పదమైందేదీ కనిపించలేదని ఓ పోలీస్ అధికారి తెలిపారు. 24 గంటల లోగా తమ వాలెట్‌కు 100బిట్ కాయిన్స్ (ఒక బిట్ కాయిన్ విలువ రూ. 6,84,725.26) బదిలీ చేయాలని, లేకుంటే నాలుగు హోటళ్లను పేల్చేస్తామని బెదిరిస్తూ బుధవారం ఉదయం ఈ మెయిల్ వచ్చింది. ఒకవేళ అనుకున్న ప్రకారం హోటళ్లను పేల్చడం కుదరకుంటే వాటిలో ఉద్యోగుల కుటుంబాల పిల్లల్ని అపహరించి, చంపేస్తామని కూడా ఈ మెయిల్‌లో హోటళ్లను బెదిరించారు. ‘ఈ మెయిల్ బెదిరింపుల గురించి హోటళ్ల యాజమాన్యం పోలీసులకు తెలిపిన తర్వాత అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబుల్ని కనుగొని నిర్వీర్యం చేసే స్కాడ్ (బిడిడిఎస్) హోటళ్లను తనిఖీ చేసింది. కానీ అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదు’ అని ఆ అధికారి చెప్పారు. స్థానిక పోలీసుల సమక్షంలో తనిఖీ నిర్వహించామని డిసిపి (ఆపరేషన్) ప్రణయ్ అశోక్ చెప్పారు.

Mumbai Five Star Hotels get threatening bomb blast

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News