Saturday, April 27, 2024

అవినీతికి పాల్పడిన మెదక్ ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మెదక్: విధి నిర్వహణలో అవినీతి ఆరోపణలు, ఇసుక మాఫియాతో చేతులు కలపడం తదీతర ఆరోపణలపై మెదక్ రూరల్ ఎస్‌ఐ ఆంజనేయులును నిజామాబాద్ రేంజ్ డిఐజీ శివశంకర్‌రెడ్డి సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఎస్‌ఐ నెలన్నర క్రితం మెదక్ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడికి వచ్చినప్పటి నుండి అతనిపై అవినీతి ఆరోపణలు వినిపించాయి. అంతేకాకుండా ఇటీవల ఓ హత్య కేసులోను సాక్షాధారాలు తారుమారు చేసి ఆత్మహత్యగా కేసు ఫైల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మెదక్ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు రాకముందు నిజాంపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు కూడా ఆంజనేయులు ఆరోపణలు ఎదురుకున్నట్లు సమాచారం. దీనిపై స్పెషల్ బ్రాంచి, ఇంటలిజెన్స్ డిపార్ట్‌మెంట్ కూడా విచారణ చేపట్టి అతనిపై ఆరోపణలు నిజమేనని విచారణలో తేలడంతో బుధవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

Medak SI suspended over corruption charges

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News