Sunday, April 28, 2024

అంగన్‌వాడీ సిబ్బంది విధులకు హాజరవుతున్నారు: బొత్స

- Advertisement -
- Advertisement -

అమరావతి: అంగన్‌వాడీ సంఘాలతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ సిబ్బంది సమ్మె విరమించారు. అంగన్ వాడీ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణా రెడ్డి చర్చలు జరిపారు. అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. 13 డిమాండ్లలో పది నెరవేర్చుతామని స్పష్టం చేశారు. జులైల్‌లో అంగన్‌వాడీ సింబది జీతాలు పెంచుతామని, మాది కక్షసాధింపుకు పాల్పడే ప్రభుత్వం కాదన్నారు. మాది ఉద్యోగుల పక్షపాతి ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఇవాళ నుంచి అంగన్‌వాడీ సిబ్బంది విధులకు హాజరవుతున్నారని బొత్స తెలిపారు.

ప్రభుత్వం నిర్ధష్టమైన హామీ ఇచ్చిందని అంగన్‌వాడీ సంఘాలు తెలిపాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలకు తాము అంగీకరిస్తున్నామని, ఇవాళ్లి నుంచి విధులకు హాజరవుతామని స్పష్టం చేశారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, సమ్మె విరమిస్తున్నామన్నారు. తమ జీతాల పెంపుపై నిర్ధిష్ట నిర్ణయం జులైలో చేస్తామని, జీతాల పెంపు ప్రభుత్వం రాతపూర్వకంగా ఇస్తుందని అంగన్ వాడీ సంఘాలు పేర్కొన్నాయి. రిటైర్‌మెంట్ బెనిఫిట్‌ను పెంచుతామని, సిబ్బందికి వైఎస్‌ఆర్ బీమా ఇస్తామని, రిటైర్‌మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News