Monday, April 29, 2024

ఇంటెలిజెన్స్ అదనపు డిజిగా అనిల్‌కుమార్

- Advertisement -
- Advertisement -

Anil Kumar as Additional DG Intelligence

ప్రభాకర్‌రావుకు ఎస్‌ఐబి చీఫ్ బాధ్యతలు
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
ఇంటెలిజెన్స్ ఎడిజిగా అనిల్ కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఎడిజి)గా నియమిస్తూ మంగళవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గవర్నర్ అనుమతితో ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్న టీ ప్రభాకర్ రావు పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో 1996 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్ కుమార్‌ను అవకాశం దక్కింది. కాగా కొంతకాలంగా తెలంగాణ ఇంటలిజెన్స్ ఛీఫ్ గా బాధ్యతలు చూస్తోన్న ప్రభాకర్ రావుకు ఎస్‌ఐబీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించారు. ఇంటలిజెన్స్ ఛీఫ్‌గా ప్రభాకర్ రావు స్థానంలో సీనియర్ ఐపిఎస్ అనిల్ కుమార్‌ను నియమించడంతో రాష్ట్ర పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News