Saturday, May 11, 2024

హృదయానికి హత్తుకునే విధంగా…

- Advertisement -
- Advertisement -

Anoop Rubens says about 30 Rojullo Preminchadam Ela

 

యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. యస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై ఫణి ప్రదీప్ దర్శకత్వంలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా యస్.వి.బాబు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 29న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతోంది. మెలోడీ మాస్టర్ అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియోకి అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా ఇందులోని ‘నీలి నీలి ఆకాశం…’ సాంగ్ 300 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాబట్టుకొని సెన్షేషనల్ హిట్ అయింది. దీంతో ఈ చిత్రానికి భారీ క్రేజ్ వచ్చింది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ “మ్యూజికల్ హిట్ మూవీ ‘మనం’తో దీన్ని పోల్చలేము. ‘మనం’ అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు. ఒకవేళ ఉంటే ఆ సినిమా పాటలకు 500 మిలియన్ల వ్యూస్ అయినా వచ్చేవి.

ఇక ఇప్పుడున్న సోషల్ మీడియాతో పాటలకు భారీ స్పందన వస్తోంది. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం…’ పాటకు అద్భుతమైన స్పందన రావడంతో ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాటకు ఇప్పటికే 300 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రావడం హ్యాపీగా ఉంది. ఇక ఈ పాట మంచి సందర్భానుసారంగా ఉంటుంది. ఈ సినిమాలో మొదట ఇదే పాట చేశాను. ఎమోషన్ టచ్‌తో ఉంటుంది ఈ పాట. ముందుగా ఈ సాంగ్‌కి ట్యూన్ చేశాను. ఆతర్వాత నాకిష్టమైన లిరిక్ రైటర్ చంద్రబోస్‌తో ఈ పాట రాయించాము. ఆయన హృదయానికి హత్తుకునే విధంగా ఈ పాట రాశారు. ఇక ఈ లవ్‌స్టోరీ మూవీ చాలా బాగుంటుంది. విభిన్నమైన భావోద్వేగాలతో ఈ సినిమా ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతినిస్తుంది”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News