Saturday, May 4, 2024

ఎసిబి వలలో ఎఒ

- Advertisement -
- Advertisement -

AO Narender trap in ACB Net

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న జె.నరేందర్ రూ.36 లంచం తీసుకుంటూ మంగళవారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ట్రాక్టర్లకు ట్రాలీలు, ట్యాంకర్లు తయారు చేసేందుకు అనుమతి కోసం సందీప్ అనే వ్యక్తి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న జె.నరేందర్‌ను సంప్రదించాడు. రెండు చక్రాలు ఉండే ట్రాక్టర్ ట్రాలీ, ట్యాంకర్ల తయారీకి సంబంధించిన అనుమతుల కోసం గత నెల 13వ తేదీన సందీప్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో ఎఒ నరేందర్‌ను కలిశాడు. అయితే, తనకు రూ.30వేలు లంచం ఇవ్వాలని ఎఒ తేల్చిచెప్పడంతో సందీప్ నేరుగా ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న ఎసిబి అధికారులు ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం వద్ద సందీప్ నుంచి లంచం తీసుకుంటున్న ఎఒ నరేందర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతని వద్ద ఉన్న రూ.36వేలను స్వాధీనం చేసుకుని అతని కుడిచేతి వేళ్లకు కెమికల్ పరీక్షలు నిర్వహించారు. తర్వాత నరేందర్‌ను అదుపులోకి తీసుకున్న ఎసిబి అధికారులు నేరుగా ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు నిందితుడు నరేందర్‌కు 14 రోజుల రిమాండ్ ఆదేశించడంతో పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఇది రెండో సారి: ఎసిబి అధికారులకు పట్టుబడిన ఎఒ నరేందర్‌పై గతంలో(04-01-216)లో రూ.8 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఎసిబి కేసు నమోదైంది. అలాగే అతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు సైతం (03-03-2016) నమోదు చేసినట్లు ఎసిబి అధికారులు వివరించారు. ఈ కేసులకు సంబంధించి ఎసిబి కోర్టులో విచారణ ముగింపు దశలో ఉన్నట్లు ఎసిబి అధికారులు మీడియాకు తెలిపారు.

AO Narender trap in ACB Net on Tuesday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News