Monday, November 4, 2024

అఖిలప్రియ అరెస్టు

- Advertisement -
- Advertisement -

ప్రవీణ్‌రావు కిడ్నాప్ కేసులో ఎపి మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు

హఫీజ్‌పేటలోని 25 ఎకరాల భూ వివాదంలో కిడ్నాప్ కేసులో ఎ1గా ఎ.వి సుబ్బారెడ్డి, ఎ2గా అఖిలప్రియ, ఎ3గా ఆమె భర్త భార్గవరామ్
అఖిలప్రియ కుటుంబంతో సుబ్బారెడ్డికి చిరకాల సంబంధాలు
కేసులో కీలక వ్యక్తి అఖిలప్రియ ముఖ్య అనుచరుడు చంద్రబోస్ అరెస్టు
ఎపి పోలీసుల సహకారంతో మిగతా వారిని కూడా పట్టుకుంటాం : పోలీసువర్గాలు
గాంధీ ఆసుపత్రిలో కళ్లు తిరిగిపడిపోయిన అఖిలప్రియ నీరసంతోనే : పోలీసులు
కేసును మూడు గంటల్లో చేధించిన పోలీసులు

మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ బాడ్మింటన్ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51) ఆయన సోదరులు సునీల్‌రావు(49), నవీన్‌రావు(47)ల కిడ్నాప్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిల ప్రియను నగర పోలీసులు బుధవారం అరెస్టు చేసి న్యాయస్థానం ముందు ఉంచగా ఆమెకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. ఈ కేసులో కేసులో ఎ-1గా ఎ.వి.సుబ్బారెడ్డిని ఎ-2గా అఖిలప్రియతో పాటు ఆమె సోదరుడిని అరెస్ట్ చేశారు. అఖిలప్రియలతో పాటు ఆమె ముఖ్య అనుచరుడు చంద్రబోస్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసును మూడు గంటల వ్యవధిలో హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులోలో మరో నిందితుడు ఎ-3 భార్గవరామ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ముందుగా అఖిలప్రియను అరెస్ట్ చేసిన పోలీసులు టిడిపి నేత ఎవి సుబ్బారెడ్డిని ఆయ్యప్ప సొసైటీ దగ్గర అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులపై 448, 419, 341, 342, 506, 366, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దుండగులు మంగళవారం నాడు ఐటి అధికారులమంటూ మూడు కార్లలో బోయిన్‌పల్లిలోని ప్రవీణ్‌రావు ఇంటికి వెళ్లి ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి రామ్‌గోపాల్‌పేట ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. హఫీజ్‌పేటలోని ఓ స్థలవివాదంలో ఈ కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది. దుండగులు భూమా అఖిలప్రియ భర్త భార్గవ రెడ్డి పేరుతో బెదిరించారు.

అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్
కిడ్నాప్ కేసులో ఎపి మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు బుధవారం రాత్రి జడ్జి ఎదుట హాజర్చడంతో న్యాయమూర్తి అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్ విధించారు. రాత్రి కావటంతో అఖిలప్రియను బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో గురువారం ఉదయం చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించనున్నారు.ఇది ఇలాఉండగా అఖిలప్రియ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అఖిలప్రియకు ఆరోగ్యం సరిగా లేదని పిటిషన్ పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్‌పై వాదనలు కోర్టు గురువారానికి వాయిదా వేసింది. కాగా బుధవారం రాత్రి భూమా అఖిలప్రియను బేగంపేటలోని మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఉంచునున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
విలువైన వస్తువుల చోరీ:
ప్రవీణ్‌రావు సోదరులను అపహరించేందుకు వచ్చిన దుండగులు లాప్‌టాప్‌లు, విలువైన వస్తువులు చోరీచేశారు. విషయం తెలియగానే హైదరాబాద్ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, హైదరాబాద్ సిపితోపాటు పోలీస్ ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సిసి పూటేజీని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. కాగా పోలీసుల అదుపులో ఉన్న కిడ్నాపర్లు భూమా అఖిలప్రియ భర్త పేరు చెప్పడంతో పోలీసులు నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, ఆయన ఇంటి తలుపులు తెరవకపోవడంతో పోలీసులు జూబ్లీహిల్స్‌లోని అఖిలప్రియ నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత మూడు వాహనాల్లో రెండు వాహనాలను గుర్తించి పట్టుకున్న పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ కేసులో చంద్రబోస్ అనే వ్యక్తిని కీలకనిందితుడని పోలీసులు గుర్తించారు. ఇక, బాధితులు సురక్షితంగా బయటపడడంతో ఆ కుటుంబసభ్యులు తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.కాగా కిడ్నాప్ కేసు విషయంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి 3 గంటల్లోనే కేసును ఛేదించారు.ముఖ్యంగా కిడ్నాపర్లు డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సిసి కెమెరాల ద్వారా గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మియాపూర్‌లో ఫిర్యాదు:
హఫీజ్‌పేటలో 25 ఎకరాలు భూవివాద వ్యవహారంలో టిడిపి నేత ఎ.వి.సుబ్బారెడ్డిపై గతంలో మియాపూర్ పోలీసుస్టేషన్‌లో ప్రవీణ్‌రావు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే ముగ్గురు సోదరుల కిడ్నాప్ జరిగినట్లు వివరించారు. అఖిలప్రియ కుటుంబంతో ముందు నుంచీ ఎ.వి.సుబ్బారెడ్డికి సంబంధాలున్నాయని తెలిపారు. కిడ్నాప్ ఘటనలో ఇతరుల ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈక్రమంలో ఎపి పోలీసుల సాయంతో వారిని అరెస్టు చేస్తామని తెలిపారు.
ప్రధాన నిందితుడు ఎవి సుబ్బారెడ్డి
కిడ్నాప్ కేసులో ఎ1గా ఉన్న ఎవి సుబ్బారెడ్డిని స్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ప్రవీణ్‌రావుతో విభేదాలు ఉన్నది వాస్తవమేనని కిడ్నాప్ కేసులో తన పాత్ర ఏమాత్రం లేదని ఎవి సుబ్బారెడ్డి చెప్పాడు. ఎప్‌ఐఆర్ కాఫీలో ఉండడం వల్లే తనను ఎ1గా చేర్చారన్నారు. పోలీసుల దర్యాప్తులో నిజాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. భూవివాదంపై ఇప్పుడు మాట్లాడబోనన్న సుబ్బారెడ్డి పోలీసు విచారణకు సహకరిస్తానని తెలిపారు. హఫీజ్‌పేట్ భూ వివాదంపై ఇప్పుడు నేను మాట్లాడలేను. అఖిలప్రియ నన్ను చంపడానికి సుపారీ ఇచ్చిందని గతంలో కేసు పెట్టా. అలాంటి వారితో కలిసి నేనెందుకు కిడ్నాప్ చేయిస్తా. ఈ కేసు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానన్నారు.
‘సీమ’ దౌర్జన్యం సహించంః మంత్రి శ్రీనివాసగౌడ్
రాయలసీమ గుండాయిజం తెలంగాణలో నడవదని, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి దౌర్జన్యాలను సహించేది లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హాకీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు సహా అతని సోదరులను కిడ్నాప్ చేసినట్లు సమాచారం రాగానే ఘటనా స్థలికి వెళ్లిన మంత్రి వివరాలు సేకరించారు. ఈ ఘటనలో ఎంతటి స్థాయి వ్యక్తులున్నా వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.
ఆసుపత్రిలో కళ్లు తిరిగి పడిపోయిన అఖిల ప్రియ
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీమంత్రి అఖిలప్రియను అరెస్టు చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగానే ఆమె కళ్లు తిరిగి పడిపోయింది. అయితే కేవలం నీరసంతో కళ్లు తిరిగి పడిపోయిందని వైద్యులు తేల్చిచెప్పారు. అంతకుమంచి అఖిలప్రియకు ఎలాంటి ఆనారోగ్య సమస్యలు లేవని వైద్యులు రిపోర్టు ఇచ్చారు. ఆసుపత్రి నుంచి ఆమెను తీసికెళ్లే సమయంలో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా కార్యక్రమాన్ని ముగించాయి. అఖిలప్రియను న్యాయమూర్తి నివాసంలో పోలీసులు హాజరుపర్చడంతో ఈనెల 20వ తేదీ వరకు రిమాండ్ అదేశించారు.

AP Ex Minister Akhila Priya Arrested in Kidnap Case

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News