Tuesday, May 7, 2024

రేపు రాష్ట్రంలో వ్యాక్సిన్ డ్రైరన్

- Advertisement -
- Advertisement -

Covid vaccine will be given to all people in State

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ మరోసారి జరగనుంది. అయితే శుక్రవారం ఒక్క రోజు మాత్రమే ఈ రన్‌ను నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తొలుత ఈనెల 8, 9వ తేదిల్లో రెండు రోజుల పాటు ఈ డ్రై రన్‌ను నిర్వహించాలని భావించిన వైద్యశాఖ, కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ షెడ్యూల్‌ను కేవలం ఒక్క రోజుకే పరిమితం చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 కేంద్రాల్లో వ్యాక్సిన్ డ్రైరన్‌ను జరిపేందుకు ఇప్పటికే వైద్యశాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దీంతోపాటు పంపిణీపై జిల్లా స్థాయి వ్యాక్సినేషన్ ఆఫీసర్లకు శిక్షణ పూర్తయిందని ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు ఇటీవల హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన డ్రై రన్‌లో ఏర్పడిన సవాళ్లు, ఇబ్బందులను ఎదుర్కోవడంపై హెల్త్ సెక్రటరీ రిజ్వీ అన్ని జిల్లాల డిఎంహెచ్‌ఓలకు వివరించారు. ఉదయం 9 గంటల నుంచి సాయత్రం ఐదు గంటల వరకు ప్రతి కేంద్రంలో 25 మందికి చొప్పున డమ్మీ వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్యశా ఖ కార్యదర్శి కోరారు. నిల్వ, పంపిణీ, టీకా ప్రయోగనంతరం వచ్చే సమస్యలను ఎదుర్కొనే విధానాలను రిజ్వీ అధికారులకు వివరించారు.

Vaccine Dry Run again in Telangana on Jan 8

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News