Friday, May 17, 2024

125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించిన ఎపి మంత్రి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : పివి మార్గ్ లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎపి సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున సందర్శించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ప్రోఫెసర్ గంట చక్రపాణి ఇతర దళిత సంఘాల నేతలు హాజరయ్యారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎపి మంత్రి అంబేద్కర్‌కు నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహ ఆవరణలో ఏర్పాటు చేసిన మ్యూజియం, థియేటర్ లను పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహ చిత్ర ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప ఆలోచనతో బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని కొనియాడారు. ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ గా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశానని, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందని ఆయనన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు తో ఇక్కడ చాలా అభివృద్ధి జరిగిందన్నారు. ఇంతటి పెద్ద విగ్రహం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా ఇక్కడ పాలన సాగుతోందన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఎలా ఉంది, ఎలా అభివృద్ధి చేశారనే విషయాలను అధ్యయనం చేసినట్లు వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అంబేద్కర్ కు ఇలా కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News