Saturday, May 4, 2024

తప్పుగా భావిస్తే గంగపుత్రులకు క్షమాపణలు చెపుతా: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Proud that corona vaccine being manufactur in hyd

మనతెలంగాణ/హైదరాబాద్: గంగపుత్రులను బాధపెట్టే విధంగా తాను ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖమంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యానాల్లో ఏవైన తప్పులు ఉన్నాయని గంగపుత్రులు భావిస్తే క్షమాపణలు చెప్పేందకు సిద్ధంగా ఉన్నాని ఆదివారం ఒక వీడియోను తలసాని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సిఎం కెసిఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికోసం ప్రభుత్వం కృషిచేస్తుందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కోకాపేటలో ఇటీవల జరిగిన ముదిరాజ్ భవన్ శంకుస్థాపనలో తాను గంగపుత్రులను బాధపెట్టేవిధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. దేశాననికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గంగంపుత్రుల సంక్షేమం, అభివృద్ధి పట్టించుకున్న వారులేరని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మత్యకార సోసైటీల్లో పలువర్గాలవారు సభ్యులుగా ఉండేవారని చెప్పారు. మత్యకార వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గంగపుత్రులు,బెస్తలు, ముదిరాజ్‌లకు మేలు చేయాలనేది ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్దేశమని ఆయన తెలిపారు.

Apologies to Gangaputras: Minister Talasani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News