Wednesday, May 1, 2024

గ్రూప్2 ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ కోసం తెలంగాణ బిసి స్టడి సర్కిల్ దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 200 మంది అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటి క్యాంపస్‌లోని బిసి స్టడి సర్కిల్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 23వ తేదీ నుండి ద్విభాషలో శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని స్టడి సర్కిల్ డైరెక్టర్ కె. అలోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉచిత శిక్షణకు తల్లిదండ్రుల వార్శికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు tsbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 04027077929, 7780359322 నెంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News