Monday, April 29, 2024

ఘనంగా అర్జున్ కుమార్తె నిశ్చితార్థం..

- Advertisement -
- Advertisement -

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం.. కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడైన తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతి రామయ్యతో ఘనంగా జరిగింది. చెన్నైలో అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయంలో ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఇరు కుటుంబాలకు చెందిన బంధువుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

నిశ్చితార్థం అనంతరం ఐశ్వర్య, ఉమాపతిల వివాహం 2024 సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో ఉంటుందని అర్జున్ సర్జా తెలిపారు. ఈ నిశ్చితార్థానికి ఇరు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు, బంధువులను మాత్రమే పిలిచామని.. పెళ్లికి మాత్రం అందరినీ ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా అర్జున్ సర్జా మీడియాకు తెలియజేశారు.

Arjun's Daughter Engagement with Actor Umapathy Ramaiah

ఈ నిశ్చితార్థ వేడుకలో ఉమాపతి రామయ్య డ్రస్‌ను ముంబైకి చెందిన మనీష్ మల్హోత్రా డిజైన్ చేయగా.. ఐశ్వర్య అర్జున్ ధరించిన డ్రస్‌ను జయంతి రెడ్డి డిజైన్ చేశారు. 5 క్యారెట్ బర్మీస్ రూబీ విత్ డైమండ్ అండ్ వైట్ గోల్డ్తో చేసిన రింగ్స్ని ఐశ్వర్య అర్జున్ ధరించగా.. ఉమాపతి కూడా గోల్ అండ్ డైమండ్ రూబీ ధరించారు. అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయంలోని రాములువారి విగ్రహం ముందు ఐశ్వర్య-ఉమాపతి నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నట్లుగా అర్జున్ సర్జా చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News