Saturday, April 27, 2024

ఆయుధ బేహారుల చేతిలో ప్రభుత్వాలు

- Advertisement -
- Advertisement -

ఈ రోజున అత్యధికంగా రక్షణరంగ సామాగ్రి, ఆయుధాల కొనుగోలులో ఆసియా ఖండంలో చైనా,- భారత్‌లే మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. చైనా తన ఆయుధ కొనుగోలు బడ్జెట్ ను 2018 తో పోలిస్తే 2019 లో 5.1 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఖర్చు చేసింది. ఇదే కాలంలో భారత దేశం 6.8 శాతం అంటే 71.1 బిలియన్ డాలర్లు ఎక్కువగా రక్షణ సంపత్తిపై ఖర్చు చేసింది. తరువాతి స్థానంలో జపాన్, దక్షిణ కొరియాలున్నాయి. మొన్నటి వరకు కమ్యూనిస్టు- పెట్టుబడిదారుల మధ్య పోటీ ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరు పెట్టుబడిదారుల మధ్యనే పోటీ ఏర్పడింది. ప్రపంచంలోని మొదటి ఐదు ఆగ్ర రాజ్యాలైనా అమెరికా, చైనా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌లతో పాటు ఇప్పుడు ఇజ్రాయెల్, స్వీడన్, జర్మనీ దేశాలు కూడా యుద్ధ సామాగ్రిని తయారు చేసి అమ్మడంలో పోటీ పడుతున్నాయి.

Arms purchase by india-china

ప్రజాస్వామ్య దేశాలలో ప్రజల మాటే వేదమ ని రాజ్యాంగాలలో, పుస్తకాలలో రాసుకొన్నా, చదువుకొన్నా, ఈ 21వ శతాబ్దంలో మాత్రం దానికి విరుద్ధంగానే జరుగుతుంది. ప్రజలందరి ఆకాంక్షలతో, వారి అభీష్టం మేరకు ఎన్నుకోబడ్డ ప్రజా నాయకులే రాజ్యాధికారానికి వచ్చినా, పాలనలో మాత్రం నాయకుల వ్యక్తిగత ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యత దొరుకుతుంది.ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, భారత్‌లు ప్రపంచానికే ఆదర్శమైనవిగా చెప్పుకొంటాము. ఇంగ్లాండ్ నుండి ప్రజాస్వామిక విలువలను తెచ్చుకొని, వాటికి మరింత పదునుపెట్టి, ప్రపంచంలోని మరే దేశంలో లేని పౌర హక్కులను, విలువలను రాజ్యాంగాలలో రాసుకొన్నాం. కానీ ఈ రోజు ప్రజల ఆకాంక్షల కన్నా, కొంత మంది పెత్తందార్ల, పెట్టుబడిదారుల ఆకాంక్షలకే ఎక్కు వ విలువ లభిస్తుంది. పాలన అంతా పెట్టుబడిదారుల ఉత్పత్తులను అమ్ముకోవడానికి అనుకూలంగా సాగుతుంది.
అభివద్ధి చెందిన దేశాలైనా, అభివద్ధి చెందుతున్న దేశాలైనా, చిన్నాచితకా దేశాలైనా, పెట్టుబడిదారుల ఉత్పత్తులను కొనే, వినియోగదారులుగా మారిపోతున్నాయి. ముఖ్యం గా ప్రజల విద్య, వైద్య, ఆరోగ్య విషయాలలో కాకుండా ప్రజల బాగోగులు చూడకుండా, ఆయుధ సంపత్తిని అమ్ముకొని బతికే దేశాలదే, వీటిపై ఆధిపత్యంగా మారిపోయింది. భారతదేశం 2009 -2014 మధ్య కొనుగోలు చేసిన ఆయుధ సంపత్తి కంటే ఎక్కువగా, 2014-2019ల మధ్య కొనుగోలు చేయడం వెనుక ప్రపంచ ఆయుధ ఉత్పత్తిదారుల ఒత్తడి కూడా ఉంది. చైనా దుందుడుకు చర్యల వల్ల దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అడ్డుకోవడానికి అమెరికా జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. చైనాను ఆపడానికి, దాని వ్యతిరేక దేశాలకు అన్ని రకాల సహాయం చేయడానికి అమెరికా ముందుందనే విషయం మొన్నటి, గాల్వాన్ వ్యాలీలోని ఉద్రిక్తతల నడుమ, భారత్‌కు సహాయం చేయడానికే తమ యుద్ధ నౌకాలను హిందూమహా సముద్రానికి పంపుతున్నామనే అమెరికా ఏకపక్ష ప్రకటనే ఇందుకు సాక్ష్యం.
ఈ రోజున అత్యధికంగా రక్షణ రంగ సామాగ్రి, ఆయుధాల కొనుగోలులో ఆసియా ఖండంలో చైనా,- భారత్‌లే మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. చైనా తన ఆయుధ కొనుగోలు బడ్జెట్ ను 2018 తో పోలిస్తే 2019 లో 5.1 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఖర్చు చేసింది. ఇదే కాలంలో భారత దేశం 6.8 శాతం అంటే 71.1 బిలియన్ డాలర్లు ఎక్కువగా రక్షణ సంపత్తిపై ఖర్చు చేసింది. తరువాతి స్థానంలో జపాన్, దక్షిణ కొరియాలున్నాయి.
మొన్నటి వరకు కమ్యూనిస్టు- పెట్టుబడిదారుల మధ్య పోటీ ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరు పెట్టుబడిదారుల మధ్యనే పోటీ ఏర్పడింది. ప్రపంచంలోని మొదటి ఐదు ఆగ్ర రాజ్యాలైనా అమెరికా, చైనా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌లతో పాటు ఇప్పుడు ఇజ్రాయెల్, స్వీడన్, జర్మనీ దేశాలు కూడా యుద్ధ సామాగ్రిని తయారు చేసి, అమ్మడంలో పోటీ పడుతున్నాయి. మొన్నటి వరకు మధ్య ఆసియా, అరబ్ దేశాలు, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలలో ఉన్న జాతి వైషమ్యాలను రెచ్చగొట్టి, అక్కడి జాతుల మధ్య చిచ్చుపెట్టి, వ్యాపారం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపగల క్రూడాయిల్ ఉత్పత్తి నిలువలున్న గల్ఫ్ దేశాలలో ఉన్న అరబ్ జాతుల మధ్య ద్వేషాన్ని ఆసరాగా చేసుకొని, ఉగ్రవాదానికి ఆసరాగా ఉన్న అమెరికా, రష్యాలు తమ మిత్ర దేశాల ఆయుధ వ్యాపారాన్ని, నిరాటంకంగా కొనసాగించాయి. ఆఫ్ఘాన్, ఇరాక్, ఇరాన్ దేశ అంతర్గత సమస్యలలో జోక్యం చేసుకొని, అక్కడి ప్రభుత్వ వ్యతిరేక వర్గాలకు ఆయుధాలు సరఫర చేయడంతో పాటు, అక్కడి ప్రభుత్వాలను ప్రత్యక్ష చర్యల ద్వారా కూలదోస్తూ తమ మిత్ర దేశాల ఆయుధ వ్యాపారానికి అండగా ఉన్నాయి.
ఇటీవలి కాలంలో అరబ్ దేశాలలో ఉగ్రవాదం కొంత తగ్గడం, చైనా దూకుడు పెరగడంతో అమెరికాతో సహా మిగతా పశ్చిమ దేశాల నేతలకు నిద్ర పట్టడం లేదు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా చైనా కూడా ఆయుధాలను దిగుమతి చేసుకొంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా యుద్ధ సామాగ్రి, ఇతర ఆయుధ సంపత్తిని ఉత్పతి చేసి, అమ్ముతున్న దేశాలలో అమెరికా ముందున్నది. ప్రపంచ ఆయుధ అమ్మకాలలో గత సంవత్సరం అమెరికా వాటా 35 శాతం అంటే, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆయుధాల అమ్మకాలపై ఎంతగా ఆధారపడి ఉందో అర్థం అవుతుంది.
శాంతి వచనలు పలికే అమెరికా, ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికే ఏర్పడ్డ ఐక్యరాజ్య సమితిని అన్ని వైపుల నుండి నీరుగారుస్తూ, తన ప్రాభవాన్ని, ఆధిత్యాన్ని నిలుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నది. ఈ రోజు ఐక్యరాజ్య సమితి చేసే ఏ పనినైనా, ఏదో ఒక వంకతో అడ్డుకోవడం, లేదా దానికి ఇవ్వాల్సిన నిధులను ఆపి వేయడం చేస్తుంది.
గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో భారతదేశం ఆయుధాలను కొంటుంది. భారత్ పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాలు ఎప్పుడు దానికి వ్యతిరేకంగానే ఉంటున్నాయి. భారతదేశంతో స్నేహంగా ఉంటున్న అమెరికా కూడా పాకిస్థాన్ పట్ల ఎక్కడలేని ప్రేమను కనబరుస్తోంది. ఇటీవలి కాలంలో అమెరికా పాకిస్థాన్ కు చేస్తున్న సహాయం తగ్గించడంతో పాకిస్థాన్ పూర్తిగా చైనాపై ఆధారపడింది. చైనా కొనే ఆయుధ సామాగ్రిలో దాదాపు 20 శాతం వరకు పాకిస్థాన్‌కు సరఫరా చేస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనే ఆలోచనలతో కొత్త కొత్త రహదారులను, ఓడ రేవులను అభివృద్ధి చేస్తున్న చైనా, పాకిస్థాన్ గుండా మధ్య, దక్షిణాగ్నేయ ఆసియా ప్రాంతం ద్వారా మిగతా ప్రపంచాన్ని చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. అందుకే, భారత దేశం ఎంతగా అభ్యంతరాలు చెప్పినా పట్టించుకోకుండా, పాకిస్థాన్‌లోని గ్వదార్ ఓడ రేవు అభివృద్ధి దానికి చైనా నుండి కారంకోరం ద్వారా పెద్ద రోడ్‌ను నిర్మించడం తెలిసిందే. శ్రీలంక ఓడరేవుల అభివృద్ధి విషయంలో అక్కడి ప్రభుత్వ కోరికలను భారతదేశం పట్టించుకోకపోవడం వల్లనే అక్కడ చైనా తిష్ఠ వేయగలిగింది. ఆఫ్రికా దేశాలతో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలలో వేల కోట్ల డాలర్ల పెట్టుబడిపెడుతున్న చైనాను అడ్డుకోవాలనే పశ్చిమ దేశాల ప్రయత్నాలలో భాగంగానే అమెరికా భారత్ పట్ల ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంది.
భారత్ -చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాలని దాని వల్ల ఎంతో కొంత లాభం పొందాలనే పశ్చిమ దేశాల ఆయుధ ఉత్పత్తిదారులు కోరుకొంటున్నారని ప్రపంచ రక్షణ నిపుణులు భావిస్తున్నారు. రక్షణ సామాగ్రిని, ఆయుధ సంపత్తిని ఉత్పత్తి చేసే సంస్థలు ఎప్పుడు ప్రత్యక్షంగా వ్యాపారం చేయవు. అవి ప్రభుత్వ విధానాలలో భాగంగానే, ప్రభుత్వాధినేతల సమక్షంలోనే వ్యాపార ఒడంబడికలు చేసుకొంటాయి. వివిధ కారణాల వల్ల ప్రపంచంలోని ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గడం వల్ల ఆయుధ ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తుల అమ్మకాలలో మందగమనం గ్రహించారు. ఇన్నాళ్ళు ప్రపంచాన్ని వణికించిన ఉగ్రవాదం వివిధ కారణాల వల్ల తగ్గుముఖం పట్టింది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో కూడా యుద్ధ్ధాలు, జాతుల మధ్య ఘర్షణలు తగ్గాయని, దానికి ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక మందకొడితనం కూడా కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచంలోని అన్ని రకాల ఆయుధ సామగ్రి అమ్మకాలు, ఉత్పత్తులను, ప్రభుత్వా ల కొనుగోళ్లను పర్యవేక్షించే స్టాక్‌హోమ్‌లోని స్వచ్ఛంద సంస్థ ‘సిప్రి’ అంచనాల ప్రకారం అమెరికాతో సహ చైనా కూడా ఆయుధ సామాగ్రిని అమ్మడంలో ముందున్నాయి. అలాగే చైనా కొంటుంది కూడా. భారత దేశ రాజకీయ నాయకులు పశ్చిమ దేశాల ఆయుధ అమ్మకాల్ పోటీ ఉచ్చులో పడకుండా, సామరస్యంగా సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. భారత దేశ నాయకత్వం గత 50 యేళ్లుగా ఇదే విధానాన్ని ఆచరించారు. యుద్ధం రాజకీయ ప్రయోజనాలను నెరవేరుస్తుందేమో కానీ, ప్రజలకు ఏమాత్రం లాభం చేకూర్చదనే అంశంలో ఎవరికీ అభ్యంతరాలు ఉండకూడదు.

సిహెచ్‌వి ప్రభాకర్‌రావు
9391533339

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News