Monday, April 29, 2024

ఆర్మీ మేనమామకు సున్నం పెట్టిన టీచర్ అల్లుడు

- Advertisement -
- Advertisement -
  • వాల్ పోస్టర్లపై స్పందించిన తల్లి
  • మనుమడిపై దుష్ఫ్రచారం ఆపాలని ఆర్మీ తల్లి ఆవేదన

హత్నూర: జిల్లా వ్యాప్తంగా గత రోజులుగా ఆర్మీ మేనమామకు సున్నం పెట్టిన టీచర్ అల్లుడు అంటూ వాల్ పోస్టర్ సోషల్ మీడియా వాల్ పోస్టర్‌గా ఆర్టీసీ బస్సులకు అంటించి వైరల్‌గా మారుతున్న వాల్ పోస్టర్‌కు మనుమనుడికి అండగా నిలిచింది. విలేకరుల సమావేశంలో హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన ఆయించ లచ్చమ్మ భర్త లక్ష్మయ్య దం పతులకు ఇద్దరు కుమారులు ఆమదయ్య, రాములు ఒక కూతురు భారతి కలదు. కూతురు మండల పరిధిలోని బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన బోట్ల దత్తయ్యకు ఇచ్చి వివాహం జరిపించారు. చిన్నతనంలోనే కూతురు భారతి మృతి చెందడంతో ఐదు సంవత్సరాల మనువడు చేర తీసినందుకు పరిస్థితులను అనుకూలంగా పెద్దవాడై ప్రభుత్వ ఉద్యోగిగా ఎదిగినట్లు ఆమె తెలిపా రు. మనుమడు బొట్ల నర్సింలుకు చిన్న కొడుకు అయిన రాములు కూతురుని ఇచ్చి వివాహం జరిపినట్లు తెలిపింది.

వంశపార్యపరంగా వస్తున్నటువంటి భూమి 10 ఎకరాలలో 4 ఎకరాలు పెద్ద కుమారునికి నాలుగు ఎకరాలు చిన్న కుమారునికి పంచగా మిగిలిన రెండు ఎకరాలు కూతురి వాటా కింద మనువడుకి రెండు ఎకరాలు ఇవ్వడం వారి పేరున భవతి చేయడం జరిగిందనీ ఇది నా ఇష్టా పూర్వకంగా గ్రామ పెద్దల సాక్షిగా ఇవ్వడం జరిగిందని, దానికి పెద్ద కుమారుడైన ఆమదయ్య జీర్ణించుకోలేక మనుమనుడుపై అసత్య ప్రచారాలు వాల్ పోస్టర్ ద్వారా ప్రచారం చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగి విలువను తీయడం జీర్ణించుకోలేక విలేకరు ద్వారా చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియా కానీ వాల్ పోస్టర్ ద్వారా కానీ ఆర్మీ మేన మామకు సున్నం పెట్టిన టీచర్ అల్లుడు వాల్ పోస్టర్ ఆ వాస్తవం అని, ఏ అధికారుల వద్దకు పిలిచిన వాస్తవాలను వివరిస్తానని తెలిపింది. ఇంతటితో కాకుండా మనుమడుకి చారవాని ద్వారా చంపుతామని బెదిరింపు కాల్స్ వచ్చాయని నా మనుమనుడికి ప్రాణహాని ఉందని స్థానిక హత్నూర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News