Saturday, May 11, 2024

దేశ ద్రోహ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో మాజీ సైనికాధికారి పిటిషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ ద్రోహ నేరానికి సంబంధించి భారతీయ శిక్షా స్మృతి(ఐపిసి)లోని 124-ఎ సెక్షన్‌ను సవాలు చేస్తూ ఒక మాజీ సైనికాధికారి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే విధంగా ఉన్న ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ మేజర్ జనరల్ ఎస్‌జి వొంబట్కేరే(రిటైర్డ్) దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ హృషికేష్ రాయ్‌తో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషన్ ప్రతిని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌కు అందచేయాలని ధర్మాసనం పిటిషనర్‌ను కోరింది.

Army veteran moves SC challenging section 124A IPC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News