Saturday, May 4, 2024

శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి

- Advertisement -
- Advertisement -

Arrangements Set For Hanuman Shobha Yatra

కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా
భారీగా బందోబస్తు ఏర్పాటు చేశాం
హైదరాబాద్ సిపి సివి ఆనంద్

హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా నగరంలో నిర్వహించే శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. బందోబస్తుపై నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఎస్‌హెచ్‌ఓలు, సీనియర్ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ శోభాయాత్ర సందర్భంగా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. వారం రోజుల నుంచి బందోబస్తు ఏర్పాట్ల గురించి సీనియర్ అధికారులతో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని సమస్యలకు అనుగుణంగా విస్కృతమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రధాన ఊరేగింపు, మార్గానికి, దానిని కలిసే ఇతర మార్గాల కూడళ్ల వద్ద ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామని, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.

అత్యంత రద్దీ ఉండే మతపరమైన ప్రదేశాలు, ఊరేగింపు మార్గంలో, షాపింగ్ ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించామని, సిసిటివిలు, డ్రోన్లు, డేఅండ్ నైట్ ఏరియా డామినేషన్, నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. మెయిన్ పిసిఆర్, ఎస్‌బి అన్ని సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో శోభాయాత్ర ఊరేగింపునకు సంబంధించిన ప్రసారాలను గమనించాలని కోరారు. శోభాయాత్ర నిర్ధేశించిన మార్గంలోనే వెళ్తుందని అన్నారు. హైకోర్టు ఏదుట పోలీసులు ముందుగా నిర్ధేశించిన మార్గంలో ఊరేగింపు కొనసాగిచాలని స్పష్టం చేశారు. శోభాయాత్ర సాఫీగా సాగేందుకు ప్రజలు సహకరిచాలని కోరారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయమార్గంలో వెళ్లాలని కోరారు. సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్, జాయింట్ సిపిలు విశ్వప్రసాద్, కార్తికేయ, రమేష్ రెడ్డి, ఎవి రంగనాథ్, డిసిపిలు కరుణాకర్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News